Monday, August 17, 2026
HomeTelanganaవైద్యో నారాయణో హరిః’ అన్న దానికి నిదర్శనంగా డాక్టర్ నవీన్

వైద్యో నారాయణో హరిః’ అన్న దానికి నిదర్శనంగా డాక్టర్ నవీన్

📰 Generate e-Paper Clip

కాకతీయ గ్యాస్ట్రో అండ్ లివర్ ఆసుపత్రిలో అరుదైన వైద్య చికిత్సలు

కడుపులో నుండి బ్యాటరీని తొలగించి.. బాలుడి ప్రాణాలు కాపాడిన డాక్టర్ నవీన్

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా; వైద్యో నారాయణో హరిః’ అంటారు. వైద్యులు ఆ భగవంతుడితో సమానం అని అర్థం. ఎందుకంటే ప్రాణం పోసేది భగవంతుడు అయితే.. ఆ ప్రాణాలను కాపాడే శక్తి ఒక్క డాక్టర్‌కే ఉంటుంది. ఎవరైనా ప్రాణాపాయంలో ఉన్న వ్యక్తిని కాపాడితే.. ఆ వైద్యులను బాధిత వ్యక్తులు దేవుడికంటే ఎక్కువగా కొలుస్తారు. అందుకు నిదర్శనమే ఈ సంఘటన.. మంచిర్యాల పట్టణానికి చెందిన ఇమీర్ అనే రెండు సంవత్సరాల బాలుడు ఆడుకుంటూ వాచ్ బ్యాటరీని నోట్లో పెట్టుకుని మింగాడు. దీంతో తల్లిదండ్రులు పలు దవాఖానలకు తీసుకెళ్లగా ప్రాణాపాయం వంటి సమస్యలు రావచ్చని, వయసురీత్యా చిన్న బాబు అవ్వడంతో వైద్యం చేయడానికి కూడా వైద్యులు ముందుకు రాలేక పోయారు. ఎవరూ కూడా చికిత్స అందించేందుకు ముందుకు రాలేదు.. అటువంటి సమయంలో మంచిర్యాలలోని కాకతీయ గ్యాస్ట్రో అండ్ లివర్ హాస్పిటల్ వైద్యుడు డాక్టర్ నవీన్ ను బుధవారం సంప్రదించారు. బాబు పరిస్థితిని పూర్తిగా విశ్లేషించిన డాక్టర్ ఈ కఠిన పరిస్థితుల్లో అడ్మిట్ చేసుకొని వైద్యం కొనసాగించారు.. అనంతరం వైద్య పరీక్షలు నిర్వహించి ఎండోస్కోపీ ద్వారా బాలుడు మింగిన వాచ్ బ్యాటరీని అత్యంత చాకచక్యంగా బాలుడు కడుపులోనున్న బ్యాటరీని బయటకి తీశారు, ఈ సందర్భంగా డాక్టర్ నవీన్ మాట్లాడుతూ.. పిల్లల పట్ల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని బ్యాటరీలు కడుపులో ఉండడం వల్ల ఆసిడ్ ను రిలీజ్ చేస్తాయని దాని కారణంగా కడుపులో సమస్యలు తలెత్తుతాయని ఒక్కోసారి ఇన్ఫెక్షన్ అయి రిస్క్ అవకాశాలు కూడా ఉన్నాయని అందుకే బ్యాటరీని త్వరగా తొలగించమని తెలిపారు.. ప్రస్తుతం బాబు పూర్తిగా కోలుకొని మాములు స్థితికి ఉన్నాడని తెలిపారు.. గతంలో ఓ బాలుడు పిన్నిస్ మింగితే కూడా తీసుకురావడం జరిగింది చాకచక్కంగా పిన్నీస్ తీసి బాబు ప్రాణాలు కాపాడమని.. ఓ వృద్ధురాలు గొంతులో మటన్ బొక్క ఇరుక్కుంటే ఊపిరాడని పరిస్థితిలో నా దగ్గరికి వచ్చారని క్షేమంగా గొంతులోని బొక్క తీసేసి ఆ తల్లిని క్షేమంగా ఇంటికి పంపించామని తెలిపారు.. బాబు ప్రాణాలు కాపాడిన డాక్టర్ నవీన్ కు, దవాఖాన సిబ్బందికి ఆ తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. వైద్యుడిని ప్రాణం పోసిన దేవుడిగా పోలుస్తూ కీర్తిస్తున్నారు. ‘వైద్యో నారాయణో హరిః’ అన్న దానికి నిదర్శనంగా నిలిచారని కొనియాడుతున్నారు..

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.