Monday, August 17, 2026
HomeTelanganaజిహెచ్ఎంసి విస్తరణకు తెలంగాణ క్యాబినెట్ ఆమోదం

జిహెచ్ఎంసి విస్తరణకు తెలంగాణ క్యాబినెట్ ఆమోదం

📰 Generate e-Paper Clip

ఆంజనేయులు న్యూస్, హైదరాబాద్: జీహెచ్ఎంసీని (GHMC) విస్తరించేందుకు తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలిపింది. 27 మున్సిపాలిటీలను జీహెచ్ఎంసీలో విలీనం చేయాలని నిర్ణయించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమావేశమైన మంత్రివర్గం సుమారు 4 గంటలకు పైగా వివిధ అంశాలపై చర్చించింది. రాష్ట్ర మంత్రి వర్గం తీసుకున్న నిర్ణయాలను మంత్రి శ్రీధరాబాబు మీడియాకు వెల్లడించారు. పెద్ద అంబర్ పేట్, జల్పల్లి, శంషాబాద్, తుర్కయంజాల్, మణికొండ, నార్సింగి, ఆదిభట్ల, మేడ నాగారం, దమ్మాయిగూడ, పోచారం, ఘట్కేసర్, గుండ్లపోచంపల్లి, తూంకుంట, తుక్కుగూడ, కొంపల్లి, దుండిగల్, బొల్లారం, తెల్లాపూర్, అమీన్పూర్, బడంగ్పేట్, బండ్లగూడ జాగీర్, మీర్ పేట్, బోడుప్పల్, నిజాంపేట్, ఫిర్జాదిగూడ, జవహర్ నగర్ మున్సిపాలిటీలను జీహెచ్ఎంసీలో విలీనం చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.