Monday, August 17, 2026
HomeTelanganaతాగునీటితో కారు క్లీనింగ్.. రూ.10వేలు జరిమానా

తాగునీటితో కారు క్లీనింగ్.. రూ.10వేలు జరిమానా

📰 Generate e-Paper Clip

ఆంజనేయులు న్యూస్, హైదరాబాద్: జలమండలి సరఫరా చేసే తాగునీటిని ఇతర అవసరాలకు వినియోగించిన ఓ వ్యక్తికి అధికారులు జరిమానా విధించారు. ఈ ఘటన బంజారాహిల్స్ లో చోటుచేసుకుంది. జలమండలి ఎండీ అశోక్ రెడ్డి బంజారాహిల్స్ ప్రధాన రహదారిపై వెళ్తుండగా.. రోడ్డు నంబర్ 12లో ఓ వ్యక్తి జలమండలి సరఫరా చేసే నీటితో కారును కడుగుతూ కనిపించారు. తాగునీటిని ఇలా ఇతర అవసరాలకు వినియోగించొద్దని హెచ్చరించారు. అంతేకాకుండా ఆయనకు నోటీసు ఇచ్చి జరిమానా విధించాలని సంబంధిత మేనేజర్ ను ఆదేశించారు. దీంతో ఆ వ్యక్తికి రూ10వేల జరిమానా విధించారు. జలమండలి సరఫరా చేసే తాగునీరు ఇతర అవసరాలకు వినియోగిస్తే తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు..

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.