Wednesday, August 19, 2026
HomeTelanganaతెలంగాణ కళావేదిక రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలుగా బత్తుల శారద

తెలంగాణ కళావేదిక రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలుగా బత్తుల శారద

📰 Generate e-Paper Clip

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: తెలంగాణ ఉద్యమం ఉదృతంగా జరుగుతున్న సందర్భంలో సాంస్కృతిక ఉద్యమాన్ని తన ఆటపాట ద్వారా ప్రజల్లోకి తీసుకవెళ్లడంలో ప్రముఖపాత్ర పోషించింది. గురువారం మంచిర్యాల జిల్లా నస్పూర్ మండల కేంద్రానికి చెందిన బత్తుల శారద ను తెలంగాణ కళావేదిక రాష్ట్ర అధ్యక్షులు నకిరేకంటి కిరణ్ కుమార్ నియమించడం జరిగింది. ఈ సందర్బంగా బత్తుల శారద మాట్లాడుతూ… తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన కళాకారులకు గత ప్రభుత్వంలో తెలంగాణ సాంస్కృతిక సారధి పేరుమీద 550 ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. ఇచ్చిన ఉద్యోగాలలో ఎక్కువ శాతం తెలంగాణ ఉద్యమానికి సంబంధం లేని అనర్హులకు ఉద్యోగాలు ఇచ్చారని కీలకంగా తెలంగాణ ఉద్యమంలో పనిచేసి అర్హులైన తోటి ఉద్యమ కళాకారులకు అన్యాయం చేయడం జరిగిందని. ఈ విషయంలో గత ప్రభుత్వాన్ని 10 సంవత్సరాలుగా తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నా స్పందన లేకుండా పట్టించుకోకుండా మేము చేసే ఉద్యమాలను అణిచివేసి నానా ఇబ్బందులు గురించేయడం జరిగిందని. గత ప్రభుత్వం గద్దె దిగాలని మరొక ఉద్యమాన్ని తెలంగాణ కళావేదిక ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు చేయడం జరిగింది. గత ప్రభుత్వం పోయింది. ఇప్పుడు రాష్ట్ర ప్రజాపాలన మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంలో మాకు న్యాయం జరుగుతుందని ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నాము.. అందుకు మామీద ఈ ప్రభుత్వం సానుకూలంగా ఉండడం హర్షనీయం.. నా నియామకానికి సహకరించిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గజవెల్లి ప్రతాప్, రాష్ట్ర కార్య నిర్వహణ కార్యదర్శి  జవ్వాజి ప్రవీణ్ కుమార్, రాష్ట్ర కార్యదర్శి కాటేపాక శంకర్ లకు కృతజ్ఞతలు తెలియజేస్తూనాన్నని తెలంగాణ కళా వేదిక సంఘం బలపడడం కోసం అహర్నిశలు పనిచేస్తానని బత్తుల శారద తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.