Monday, August 17, 2026
HomeCrimeఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్యాయత్నంపై స్పందించిన ఆర్టీసీ ఎండి సజ్జనార్

ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్యాయత్నంపై స్పందించిన ఆర్టీసీ ఎండి సజ్జనార్

📰 Generate e-Paper Clip

ఆంజనేయులు న్యూస్, హైదరాబాద్: ఆర్టీసీ డ్రైవర్‌‌కు లీవ్ ఇవ్వకుండా ఆర్టీసీ అధికారులు వేధించడం కారణంగానే ఆ డ్రైవర్ ఆత్మహత్యాయత్నం చేసుకున్నారని వస్తున్న వార్తలపై టీఎస్ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ స్పందించారు. నల్లగొండ జిల్లా దేవరకొండ డిపోనకు చెందిన డ్రైవర్‌ శంకర్‌‌కు సెలవు మంజూరు చేయకుండా ఆర్టీసీ అధికారులు వేధించడం వల్లే ఆయన ఆత్మహత్యాయత్నం చేసుకున్నారని వస్తోన్న వార్తల్లో నిజం లేదని వెల్లడించారు. ఆ డ్రైవర్ ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండానే ఈ నెల 18, 19 తేదీల్లో విధులకు గైర్హాజరు అయ్యారని. అయినా ఈ నెల 20న డ్యూటీని అధికారులు కేటాయించడం జరిగింది. మళ్ళీ ఆదివారం సెలవు కావాలని డిపో అధికారులను డ్రైవర్ శంకర్ సంప్రదించగా.. వాళ్ళు లీవ్ పొజిషన్ చూసి సెలవు మంజూరు చేస్తామన్నారు. కానీ సెలవు ఇవ్వబోమని డ్రైవర్ కు ఏ అధికారి చెప్పలేదని క్లారిటీ ఇచ్చారు. ఆర్టీసీ అధికారులు తనకు సెలవు మంజూరు చేయడం లేదని, వేధిస్తున్నారని డ్రైవర్ శంకర్ ఆరోపిస్తూ.. పురుగుల మందు తాగుతున్ననంటూ శనివారం ఒక సెల్ఫీ వీడియో వాట్సాప్ గ్రూప్‌ల్లో చేశాడు. వెంటనే డిపో అధికారులు అక్కడికి వెళ్లి ఆయనను స్థానిక ఆస్పత్రికి తరలించారు. డ్రైవర్ ఎలాంటి పురుగుల మందు తాగలేదని వైద్యులు ధ్రువీకరించి.. అనంతరం డిశ్చార్జ్ చేశారు. ప్రస్తుతం డ్రైవర్ శంకర్ ఆయన ఇంట్లోనే సురక్షితంగా ఉన్నాడని సజ్జనార్ తెలిపారు. డ్రైవర్ శంకర్ ఉద్దేశ్యపూర్వకంగానే ఈ ఘటనకు పాల్పడ్డారని సజ్జనార్ అన్నారు. గతంలోనూ సెలవుల విషయంలో అధికారులపై బెదిరింపులకు దిగారని తెలిపారు. తన లీవ్ రికార్డు బాగాలేదని. డ్రైవర్ శంకర్ గత మూడు నెలల్లో 10 సాధారణ లీవ్ లు, 20 సిక్ లీవ్ లు తీసుకున్నాడని సజ్జనార్ స్పష్టం చేశారు…

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.