
ఆంజనేయులు న్యూస్, తాండూర్: మంచిర్యాల జిల్లా తాండూర్ మండలం రేచిని గ్రామా పంచాయతీ కార్యాలయంలో సమయ పాలనా లేకుండా పని దినములో కూడా ఎప్పుడు మూసివేయబడి ఉంటుంది. గ్రామా ప్రజలు ఏదైనా అవసరాల నిమిత్తం ఆఫీస్ పని ఉండి గ్రామా పంచాయితీ కార్యాలయం కి వెళితే ఆఫీస్ కి తాళం వేసి దర్శనం ఇస్తుంది. ఇందులో పని చేస్తున్న గ్రామా కార్యదర్శికి ఫోన్ చేస్తే అక్కడ ఉన్న ఇక్కడ ఉన్న అని ఫోన్ లో సమాధానం ఇస్తున్నాడు ఒక వేళా కార్యదర్శి ఆఫీస్ కి వచ్చిన ఒక గంట లేదా రెండు గంటలు ఉండి ఎదో ఒక పని ఉందని వెళ్ళిపోతూ ఉంటాడు. కార్యదర్శి ఇలా చేయడం వలన గ్రామానికి ఇబ్బందులు ఎదురుకుంటున్నారు. అసలు గ్రామానికి కార్యదర్శి ఉన్నట్టా లేనట్టా.? అని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలా గ్రామీణ వాసులు వాపోతున్నారు..
