Monday, August 17, 2026
HomeTelanganaపోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకున్న

పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకున్న

📰 Generate e-Paper Clip

జిల్లా పౌర సంబంధాల అధికారి (DPRO) వై. సంపత్ కుమార్

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: శాసనసభ నియోజకవర్గ సాధారణ ఎన్నికలు-2023లో భాగంగా ఎన్నికల విధులు నిర్వహిస్తున్న అధికారులు, ఎన్నికల సిబ్బంది, అత్యవసర సేవలు అందిస్తున్న వారు, భారత ఎన్నికల సంఘంచే అథారిటీ లెటర్లు పొందనున్న ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు అవకాశం కల్పించిన పోస్టల్ బ్యాలెట్ లో భాగంగా జిల్లా పౌర సంబంధాల అధికారి (DPRO) వై. సంపత్ కుమార్ జిల్లా కేంద్రంలోని మంచిర్యాల రాజస్వ మండల అధికారి కార్యాలయంలలో ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలెట్ కేంద్రంలో బుధవారం తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా డిపిఆర్ఓ మాట్లాడుతూ. భారత రాజ్యాంగం పౌరులకు కల్పించిన వజ్రాయుధం ఓటు హక్కు అని, ఈ నెల 30న ఉదయం 7 గం॥ల నుండి సాయంత్రం 4 గం||ల వరకు జరుగనున్న పోలింగ్ లో అర్హత గల ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలని తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.