Monday, August 17, 2026
HomeTelanganaమంచిర్యాలలో మోసం చేస్తాడు. మలేషియాలో ఆస్తులు కొంటాడు.

మంచిర్యాలలో మోసం చేస్తాడు. మలేషియాలో ఆస్తులు కొంటాడు.

📰 Generate e-Paper Clip

కాంగ్రెస్ అభ్యర్థి ప్రేమ్ సాగర్ రావు కు మోసగాడి ముద్ర..

మంచితనంగా ముంచడానికి అలవాటు పడ్డ పిఎస్అర్.

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: జిల్లాలో మోసాలకు అక్రమాలకు కేరాఫ్ గా ప్రస్తుత కాంగ్రెస్ అభ్యర్థి ప్రేమ్ సాగర్  రావుకు అరుదైన బిరుదు కలిగి ఉందనడం లో ఆశ్చర్యం లేదు. ప్రేమ్ సాగర్ రావు మోసాలు చేయడంలో తనకు చిన్నప్పటినుండి వెన్నతో పెట్టిన విద్యగా తన తోటి చదువుకున్న స్నేహితులే బాహటంగా చర్చించుకుంటారు. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో మోసాలకు అక్రమలకు పాల్పడడంలో ప్రేమ్ సాగర్ రావు ను మించిన మరొక నాయకుడు లేడనే చెప్పుకోవచ్చు. ప్రేమ్ సాగర్ రావు చేతిలో మోసపోయిన వ్యక్తులు  తన సొంత ఊరు ధర్మారావుపేట్ లో మొదలు పెడితే హైదరాబాద్ వరకు వుంటూనే ఉంటారు. బ్యాంకులలో కోట్లాది రూపాయల అప్పులు తీసుకొని లూటీ చేయడంలో ప్రేమ్ సాగర్ రావు  తెలిసిన విద్య మరొక నాయకుడికి తెలిసి ఉండకపోవచ్చు. పేద ప్రజలను రిటైర్డ్ కార్మికులను మోసం చేస్తూ భూములు కబ్జాలకు పాల్పడి దౌర్జన్యానికి దిగడం లో ప్రేమ్ సాగర్ రావు తెలివిమంతుడు. రాష్ట్రంలో పేకాట క్లబ్ నడిపే నాయకుడు ప్రేమ్ సాగర్ రావు గా ప్రత్యేక ముద్ర వేసుకున్నాడు. పేకాట క్లబ్బు నిర్వహణ తో అనేక కుటుంబాలను రోడ్ పాలు చేసిన  ఘనత ప్రేమ్ సాగర్ రావు కే దక్కుతుంది. క్లబ్బు నిర్వహణతో పేకాట ఆడటానికి వచ్చిన బాధితులు భార్యల పుస్తెలను అమ్ముకొని ప్రేమ సాగర్ రావుకు పేకాట  పైసలు  కట్టిన పరిస్థితి అనేకంగా ఉన్నాయంటూ పలువురు చర్చించుకుంటారు. పేకాట పైసలతో మంచిర్యాల నియోజకవర్గంలో సేవా కార్యక్రమాల పేరిట తను సంపాదించిన పాపపు సొమ్మును ప్రజల మీద ఖర్చు పెడుతున్నాడు అని పలువురు పేకాట  బాధితులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.కాంగ్రెస్ అభ్యర్థి ప్రేమ్ సాగర్ రావుకు మంచిర్యాలలో మోసం చేయడం మలేషియాలో ఆస్తులు  కొనడం ఆయనకు అలవాటుగా మారింది. ఎలాంటి పదవి, అధికారం లేని సమయంలోనే ప్రేమ్ సాగర్ రావు ఇన్ని అరాచకాలకు అక్రమాలకు మోసాలకు పాల్పడిన పిఎస్అర్. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి మంచిర్యాలలో ప్రేమ్ సాగర్ రావ్ గెలిస్తే ఇంకా ఆయన అరాచకలకు అడ్డుకట్ట ఉంటుందనేది కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. రానున్న ఎన్నికల్లో ప్రేమ్ సాగర్ రావు అనే మోసగాడిని గెలిపిస్తే మంచిర్యాల ప్రజల భవిష్యత్ ఏమిటో ఒక్కసారి ప్రజలు ఆలోచించుకోవాల్సిన అవసరం లేకపోలేదు అని రాజకీయ విశ్లేషకులు కోరుతున్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.