Tuesday, August 18, 2026
HomeTelanganaకేసీఆర్ పై పోటీ.. కామారెడ్డి బరిలో రేవంత్ రెడ్డి?

కేసీఆర్ పై పోటీ.. కామారెడ్డి బరిలో రేవంత్ రెడ్డి?

📰 Generate e-Paper Clip

ఆంజనేయులు న్యూస్, హైదరాబాద్: పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కామారెడ్డి నియోజకవర్గం నుంచి బరిలో దిగనున్నట్లు తెలిసింది. కొడంగల్ నుంచి రేవంత్ అభ్యర్థిత్వాన్ని పార్టీ ఇప్పటికే ప్రకటించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ గజ్వేల్ తో పాటు కామారెడ్డిలో పోటీ చేస్తున్న నేపథ్యంలో రేవంత్ ను కూడా కొడంగల్ తో పాటు కామారెడ్డి నుంచి పోటీ చేయించాలని పార్టీ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. కామారెడ్డి నుంచి టికెట్ ఆశించిన మాజీ మంత్రి షబ్బీర్ అలీ ఇప్పటికే ప్రచారం ప్రారంభించారు. తాజా నిర్ణయం నేపథ్యంలో షబ్బీర్అలీకి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పార్టీ తరపున ప్రచార బాధ్యతలను అప్పగించనున్నట్లు తెలిసింది. అధికారికంగా జాబితా వెల్లడైన తర్వాతనే దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.