Tuesday, August 18, 2026
HomeTelanganaబీజేపీకి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా?

బీజేపీకి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా?

📰 Generate e-Paper Clip

ఆంజనేయులు న్యూస్, హైదరాబాద్: భారతీయ జనతా పార్టీకి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బుధవారం  రాజీనామా చేశారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరికకు రంగం సిద్ధమైంది. తాను కాంగ్రెస్ లో చేరుతున్నట్లు రాజగోపాల్ రెడ్డి ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ కుటుంబ దుర్మార్గపు పాలన నుంచి తెలంగాణను విముక్తి చేయాలనే నా ఆశయం మరో ఐదు వారాల్లో నెరవేరుతుందని భావిస్తున్నానని ఆయన అన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేకత తీవ్ర స్థాయిలో ఉంది. ప్రజలు మార్పును కోరుకుంటున్నట్టు స్పష్టమవుతోంది. ఏడాదిన్నర క్రితం తెలంగాణలో అధికార బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా ఎదిగిన బిజెపి, ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల్లో కొంత డీలా పడిందన్నారు. ఇప్పుడు తెలంగాణ ప్రజలు అధికార బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ ను భావిస్తున్నారు. అందుకే తాను కూడా తెలంగాణ ప్రజల ఆలోచనలకు అనుగుణంగా వ్యవహరించాలని నిర్ణయించుకున్నానని తెలిపారు..

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.