Wednesday, August 19, 2026
HomeTelanganaఆర్థిక సహాయం పథకం కోసం దరఖాస్తుల స్వీకరణ

ఆర్థిక సహాయం పథకం కోసం దరఖాస్తుల స్వీకరణ

📰 Generate e-Paper Clip

జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి వినోద్ కుమార్

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: వెనుకబడిన వర్గాల కులవృత్తులు, చేతివృత్తుల వారు 1 లక్ష రూపాయల ఆర్థిక సహాయం పథకం కొరకు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి వినోద్ కుమార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. 18 నుండి 55 సం॥ల వయస్సు గల వెనుకబడిన వర్గాలకు చెందిన వారు దరఖాస్తు చేసుకోవాలని, వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాలలో 1 లక్ష రూపాయలు, పట్టణ ప్రాంతాలలో 2 లక్షల రూపాయలు గల వారు ఆన్లైన్లో tsobmmsbc.cgg.gov.in ఈ నెల 20వ తేదీ లోగా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ఈ నెల 9న రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు చేతుల మీదుగా మంచిర్యాలలో ఈ పథకం ప్రారంభించడం జరుగుతుందని, ఆధార్కార్డు, కులం, ఆదాయ ధృవపత్రం-2023, నివాస ధృవీకరణ పత్రం, రేషన్కార్డు, ఫొటోలతో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.