Monday, August 17, 2026
HomeTelanganaపచ్చదనం పరిఢవిల్లాలి.. పుడమి పరవశించాలి

పచ్చదనం పరిఢవిల్లాలి.. పుడమి పరవశించాలి

📰 Generate e-Paper Clip

ఆంజనేయులు న్యూస్, తెలంగాణ: ప్రకృతి ఎన్నో వనరులను ప్రసాదించింది. మానవ తప్పిదాలు. ఆధునిక జీవనశైలి, విచ్చలవిడి ప్లాస్టిక్ వినియోగం, జీవవైవిధ్యం దెబ్బతినడం… ఇలా ఎన్నో రకాలుగా పర్యావరణానికి హాని కలుగుతోంది. ఆ ప్రభావం జీవవైవిధ్యంపైనా పడుతోంది. తరిగిపోతున్న పచ్చదనం కారణంగా ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరగడంతోపాటు ఎన్నో విధాలుగా అందరికీ హాని కలుగుతోంది. ఈ ప్రమాదాన్ని గుర్తెరిగి పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది. సోమవారం ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా అంజనేయులు న్యూస్ యూజర్ల కోసం ప్రత్యేక కథనం. ప్లాస్టిక్ వినియోగం నేడు సాధారణ మానవుని జీవితంలో భాగమైంది. పాల ప్యాకెట్ల నుంచి కూరగాయల వరకు అన్నింటికీ ఉపయోగిస్తున్నాం. ఈ నేపథ్యంలో గుడ్డ సంచుల వాడకాన్ని పెంచాలని పర్యావరణ వేత్తలు కోరుతున్నారు. అలాగే మట్టితో తయారయ్యే వస్తువులను వాడాలని సూచిస్తున్నారు.
రానున్న రోజుల్లో కేవలం విద్యుత్తు కోసమే రూ.లక్షల కోట్లు కేటాయించాల్సి వస్తుందని ఇటీవల విద్యుత్తు శాఖ అధికారులు చెప్పడం గమనార్హం. ఈక్రమంలో ఇళ్లల్లో వినియోగం తగ్గించాలి. ఎక్కువ సరఫరాను ఉపయోగించుకునే పరికరాలను వాడకపోవడం మేలు. అవసరం లేనప్పుడు బల్బులు, పంకాలు, టీవీలు, శీతలీకరణ యంత్రాలను ఆపేయాలి. వేసవి నేపథ్యంలో నీటి కష్టాలు తప్పడం లేదు. గత రెండేళ్లలో జూన్ నుంచి సెప్టెంబరు వరకు కురవాల్సిన వర్షాలు పూర్తిస్థాయిలో పడలేదు. భూగర్భ జలాలు సైతం అడుగంటుతున్నాయి. గత నెలలో గరివిడిలో అత్యధిక లోతులో (13.59 మి.మీల) నీటిమట్టం నమోదైంది. ఈ పరిస్థితి రాకుండా ఉండాలంటే ఇంకుడు గుంతలు తప్పనిసరి. ఆరుతడి పంటలు వేయడం, బోరు బావులు ఒకేచోట లేకుండా చూసుకోవడం, ఇళ్లు, పరిశ్రమలు, ఇతర చోట్ల అవసరం మేరకు నీటిని ఉపయోగించడం, వృథాకు అడ్డుకట్ట వేయడం, జలవనరుల పెంపు తదితర విధానాలు పాటించాలి. ఈ వ్యర్థాలు మట్టిలో కలిసే అవకాశం తక్కువ. కాబట్టి సాధ్యమైనంతగా తిరిగి ఉపయోగించే విధంగా చూసుకోవాలి. మిషన్లైఫ్లో భాగంగా పురపాలికలు ప్రత్యేక చర్యలు చేపడుతున్నాయి. సుస్థిర ఆహార విధానంలో భాగంగా చిరుధాన్యాలు, పప్పులు, విటమిన్లు ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. దీంతో దీర్ఘకాలిక వ్యాధులు దూరమవుతాయని వైద్యులు పేర్కొంటున్నారు. నవధాన్యాలు, పచ్చిరొట్ట ఎరువుల వినియోగం, స్థానిక వనరులతో జీవామృతాలు తయారు చేసుకుని వినియోగించడంతో భూమి సారవంతమై మంచి దిగుబడులు సాధిస్తున్నారు. ఇప్పుడు ప్రతిచోటా చెత్త, వ్యర్థాలు విచ్చలవిడిగా కనిపిస్తున్నాయి. కార్మికులు సేకరిస్తున్నా.. కొన్నిచోట్ల పరిస్థితి మారడం లేదు. ఈక్రమంలో పొడి, తడిని వేరు చేసి, ఇంట్లో సేంద్రియ ఎరువులను సిద్ధం చేసుకోవచ్చు. దీనికి అధికారులే డబ్బాలను ఇస్తున్నారు. డాబాలపై కూరగాయలు, పండ్ల మొక్కలు పెంచుకోవచ్చు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.