
ఆంజనేయులు న్యూస్, హైదరాబాద్: కేసీఆర్ సర్కారును ఎప్పడూ ఎదో ఓ టెన్షన్ వెంటాడుతూనే ఉంటున్నది. తాజాగా మహరాష్ట్రకు చెందిన బీఆర్ఎస్ నేత శరద్ మర్కడ్‌ను కేసీఆర్ ప్రయివేట్ సెక్రటరీగా నియమిస్తూ సీఎస్ జీవో జారీ చేశారు. ఈ జీవోను ఆన్‌లైన్‌లో ఉంచకుండా ప్రభుత్వం జాగ్రత్త తీసుకున్నది. కానీ రెండు రోజులకే ఆ కాపీ బయటకు రావడంతో ప్రగతిభవన్ వర్గాలు షాక్ తిన్నాయి. అది కాస్త ప్రతిపక్షాల చేతికి చిక్కడంతో వారి నుంచి విమర్శలు మొదలయ్యాయి. జాగ్రత్తలు పాటించినా జీవో కాపీ ఎలా బయటకు వచ్చిందనేది సస్పెన్స్‌గా మారింది. ఈ విషయం సీఎం కేసీఆర్ అసహనం వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం. మరి కాపీ ఎక్కడి నుంచి లీకైందనే విషయంపై అధికారులు ఆరా తీస్తున్నారు.
తెలంగాణ మహరాష్ట్రకు చెందిన బీఆర్ఎస్ నేత శరద్ మర్కడ్‌ను సీఎం కేసీఆర్‌కు పర్సనల్ సెక్రటరీగా నియమించారు. ఆయనకు నెలకు రూ.లక్షన్నర వేతనం అదిస్తున్నట్టు ఈనెల 2వ తేదీన జోవో జారీ అయింది. ఆ విషయం బయటకు తెలియకుండా జాగ్రత్తపడ్డారు. జీవో కాపీని ఆన్‌లైన్‌లోనూ పెట్టలేదు. అంత వరకు బాగానే ఉన్నా.. రెండు రోజుల అనంతరం ఆ జీవో కాపీ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేతికి చేరింది. ఈ విషయంపై మీడియాతో మాట్లాడిన ఆయన ఆ జీవో కాపీని బయటపెట్టారు. దీంతో ప్రగతిభవన్ వర్గాలు ఒక్క సారిగా షాక్ అయినట్టు సమచారం. సీక్రెట్‌గా ఉంచిన జీవో కాపీ ఎలా బయటకు విషయంలో అధికారులు ఆరా తీయడం మొదలుపెట్టినట్టు తెలుస్తున్నది.
