Monday, August 17, 2026
HomeCrimeయువకుడు అనుమానస్పద మృతి.

యువకుడు అనుమానస్పద మృతి.

📰 Generate e-Paper Clip

ఆంజనేయులు న్యూస్, జగిత్యాల జిల్లా: జిల్లాలో కోరుట్ల పట్టణంలోని రాంనగర్ కాలనీలో నివాసముంటున్న కొత్తపల్లి అశోక్ (35) అనే యువకుడు అనుమానాస్పదంగా మృతి చెందిన సంఘటన గురువారం కోరుట్లలో కలకలం రేపింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం కొత్త పెళ్లి అశోక్ అనే యువకుడు గత కొన్ని రోజులుగా తన భార్య తనతో ఉండడం లేదని మద్యానికి బానిసై ప్రతిరోజు మద్యం సేవిస్తూ ఇంట్లో ఒక్కడే ఉండేవాడిని సుమారు మూడు, నాలుగు రోజుల క్రితం చనిపోయి ఉన్నట్లు స్థానికులు తెలిపారు. మృతుని భార్య నాగరనిని వివరాలు అడగగా తన భర్త అశోక్ ప్రతిరోజు మద్యం మత్తులో మమ్మల్ని పిల్లల్ని కొట్టేవాడని, భర్త పెట్టె బాధలు తట్టుకోలేక తన తల్లిగారింటికి వెళ్ళిపోయాను అని బోరున విలపిస్తూ తెలిపింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.