Friday, July 3, 2026
HomeCrimeదారుణ హత్యకు గురైన ట్రాక్టర్ డ్రైవర్

దారుణ హత్యకు గురైన ట్రాక్టర్ డ్రైవర్

📰 Generate e-Paper Clip

Post Midle

ఆంజనేయులు న్యూస్, నిర్మల్ జిల్లా: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లో వరుస హత్యలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఈ మధ్య కాలంలో వరుసుగా హత్య లు జరుగుతుండటంతో ఉమ్మడి జిల్లాలో ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. ఈ నేపధ్యంలోనే నిర్మల్ జిల్లాలో మరో దారుణ హత్య చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. గుర్తు తెలియని దుండగుల చేతిలో తాటికొండ వినోద్ (28) అనే ట్రాక్టర్ డ్రైవర్ పొనకల్ గ్రామ శివారులోని అటవీ ప్రాంతంలో దారుణ హత్యకు గురైన ఘటన వెలుగులోకి వచ్చింది. పొన్కల్ గ్రామానికి చెందిన తాటికొండ వినోద్ (28) ట్రాక్టర్ డ్రైవర్ గా పని చేస్తున్నాడు. గత మూడు రోజుల నుంచి కనిపించడం లేదని కుటుంబ సభ్యులు ఎక్కడ వెతికిన ఆచూకీ లభించలేదు. గురువారం పశువుల కాపర్లు వినోద్ మృతదేహాన్ని చూసి గ్రామస్తులకు, పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి సీఐ నవీన్ కుమార్, ఎస్సై అశోక్ లు చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. సంఘటనా స్థలంలో దారుణ హత్యకు గురై విగీత జీవిగా పడి ఉన్న వినోద్ ను చూసి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటన పై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Post bottom
RELATED ARTICLES

Most Popular

App Icon

Install ANJI News App

Add to home screen for faster loading and latest updates.