Tuesday, August 18, 2026
HomeCrimeవసతులు తక్కువ.. వసూళ్లు ఎక్కువ

వసతులు తక్కువ.. వసూళ్లు ఎక్కువ

📰 Generate e-Paper Clip

చెన్నూరు కూరగాయల మార్కెట్ దుస్థితి ఇది. ఇక్కడ కూరగాయలు విక్రయించే వ్యాపారులు ఇలా ఎండకు ఎండుతూ. వానకు తడుస్తూ వ్యాపారాలు సాగిస్తున్నారు.

చెన్నూరు గాంధీచౌక్ ప్రాంతంలో ఎండ నుంచి రక్షణ పొందేందుకు గొడుగులు,

పరదాలు ఏర్పాటు చేసుకొని విక్రయాలు సాగిస్తున్న వ్యాపారులు

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: జిల్లాలోని పురపాలక సంఘాల్లో కూరగాయల మార్కెట్లు, వార సంతల్లో విక్రయాలు సాగించే వ్యాపారుల నుంచి రోజూ రుసుం వసూలు చేస్తున్నా కనీస సదుపాయాలు కల్పించడంలో బల్దియాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయి. తాగునీరు, మరుగుదొడ్లు, ఎండ, వానల నుంచి రక్షణ, పార్కింగ్ కు స్థలాలు లేకపోవడంతో వ్యాపారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఈనెలలో మళ్లీ తైబజార్ వేలం పాటలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో బల్దియాల్లోని మార్కెట్లు, వారసంత పరిస్థితులపై కథనం. పురపాలక సంఘాల పరిధిలోని రహదారులపై కూర్చొని వ్యాపారం చేసే వారి నుంచి రుసుము వసూలు చేసేందుకు తైబజారు వేలం వేస్తారు. అర్హత పొందిన గుత్తేదార్లు ఏడాది పాటు రోజూ వ్యాపారుల దగ్గరి నుంచి నిర్దేశించిన రుసుం వసూలు చేసుకోవాలి. వేలం ద్వారా వచ్చిన ఆదాయాన్ని వ్యాపారుల మౌలిక అవసరాలకు పురపాలికలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇది ఎక్కడా అమలు కాకపోవడతో వ్యాపారులకు ఏటా ఇబ్బందులు తప్పడం లేదు.

• సౌకర్యాల మాటేంటి?

జిల్లాలో మంచిర్యాల, బెల్లంపల్లి, మందమర్రిలు పాతపురపాలికలు కాగా లక్షెట్టిపేట, చెన్నూరు, నస్పూరు, క్యాతన్పల్లి, నూతనంగా ఏర్పడ్డాయి. చెన్నూరులో ఈ ఏడాది వేలం పాటకు ఎవరూ ముందుకు రాకపోవడంతో బల్దియా సిబ్బందితోనే రుసుం వసూలు చేయిస్తుండగా.. మిగతా అన్ని పురపాలక సంఘాల్లో గుత్తేదార్లు తైబజార్ ను దక్కించుకొని వ్యాపారుల నుంచి మార్కెట్ రుసుం వసూలు చేస్తున్నారు. ఆయా బల్దియాల్లో రోడ్ల పక్కన కూరగాయల విక్రయాలు సాగించే వారు, తోపుడు బండ్లపై వ్యాపారం చేసే వారు, ఇతర చిరు వ్యాపారస్థులు రోజూ రుసుం చెల్లిస్తూ వారివారి వ్యాపార కార్యకలాపాలు సాగిస్తుంటారు. పురపాలక సంఘాలకు తైబజార్ల నిర్వహణ ద్వారా ఏటా ఆదాయం సమకూరుతుంది. వచ్చిన ఆదాయంలో కొంత మొత్తాన్ని వ్యాపారుల వసతి, సౌకర్యాలకు కేటాయించాలి. కాని ఇది ఎక్కడ కూడా ఆశించిన రీతిలో అమలు జరగడం లేదు.

• సౌకర్యాలు కల్పించాలి

-పద్మ, కూరగాయల వ్యాపారి, చెన్నూరు.

వ్యాపారం నడిచినా, నడవకున్నా.. మార్కెట్ ఫీజు వసూలు చేస్తున్న అధికారులు కనీస సదుపాయాలు కల్పించడం లేదు. మరుగుదొడ్లు, మూత్రశాలలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.