Tuesday, August 18, 2026
HomeTelanganaఅధిక ఫీజు చెల్లించాలంటూ విద్యార్థికి బెదిరింపులు

అధిక ఫీజు చెల్లించాలంటూ విద్యార్థికి బెదిరింపులు

📰 Generate e-Paper Clip

సర్టిఫికెట్లు ఇవ్వకుండా విద్యార్థిని ఇబ్బందులకు గురి చేస్తున్న మిమ్స్ కళాశాల యాజమాన్యం

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: జిల్లా పరిధిలో గల మిమ్స్ కళాశాల యాజమాన్యం విద్యార్థి ఫీజు చెల్లిస్తేనే సర్టిఫికెట్లు ఇస్తామని డిమాండ్ చేయడంతో సలిగంటి దిలీప్ కుమార్ అనే విద్యార్థి న్యాయం కోసం మంగళవారం కాలేజ్ రోడ్డు లో గల వాటర్ ట్యాంక్ ఎక్కడం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థి తండ్రి మహేందర్ మాట్లాడుతూ.. నా కొడుకు దిలీప్ కుమార్ ను 2 సం॥రాల క్రితం ఇంటర్మీడియట్ (ఎం.పీ.సీ) గ్రూపులో అడ్మిషన్ చేయడం జరిగింది. అడ్మిషన్ సమయంలో మిమ్స్ కళాశాల యాజమాన్యంతో 2 సం॥ లకు రూ.18,000/- అని ఒప్పందం చెకుర్చుకున్నాము దానికి వారు సరే అని ఒప్పుకున్న తరువాతనె వారి కళాశాల లోకి తీసుకున్నారు.. ఇప్పుడేమో మాటమర్చి  నేను అలా మాట్లాడలేదు అని మీరు రూ. 40వేలు చెల్లించాలని, అలా చెల్లించని యెడల మీకు సర్టిఫికెట్లు ఇవ్వము అని మిమ్స్ కళాశాల ప్రిన్సిపాల్  శ్రీనివాసరాజు డిమాండ్ చేస్తూ మమ్ముల్ని బెదిరింపులకు గురి చేస్తున్నారు. ఇంతలో నా కొడుకు దిలీప్ కుమార్ కు ఇంజనీరింగ్ కాలేజీలో సీటు వచ్చి ఉన్నది. కానీ ఇప్పుడు సర్టిఫికెట్లు ఇవ్వకపోవడంతో ఇంజనీరింగ్ కళాశాలలో సీటు వచ్చే అవకాశాలు సన్నగిల్లుతుండడంతో మేము భయభ్రాంతులకు గురై, అనంతరం ఏమి చేయలేని పరిస్థితిలో నా కొడుకు దిలీప్ కుమార్ న్యాయం కోసం వాటర్ ట్యాంక్ ఎక్కాడు, కావున జరిగిన దానికి ప్రభుత్వం న్యాయం కోసం చేసిన పోరాటంగా భావించి మమ్మల్ని మందలించి, ప్రభుత్వం నా కొడుకు భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని అధిక ఫీజు వసూలు చేస్తున్న మిమ్స్ కళాశాల శ్రీనివాసరాజును మందలించి మాకు సర్టిఫికెట్లు ఇప్పించగలరని ప్రభుత్వాన్ని కోరుతున్నాం అని తెలిపారు..

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.