నా ఆత్మహత్యకు కారణం బెల్లం వేణు
ముప్పై టాబ్లెట్స్ మింగిన ఇన్సిపెక్టర్
బెల్లం వేణు తిట్టాడని మనస్తాపం
మారెమ్మగుడి కమిటీ వివాదమా.. పార్టీ లో పొరునా

ఆంజనేయులు న్యూస్, ఖమ్మం జిల్లా: దేవాదాయశాఖ ఇన్సిపెక్టర్ సమత ఆత్మహత్య ప్రయత్నం చేశారు. బిఆర్ఎస్ పార్టీ మండల భాద్యులు బెల్లం వేణు తనను పరుష పదజాలంతో దూషించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఖమ్మం రూరల్ మండలంలోగల మారెమ్మ గుడి దేవాలయ కమిటీ విషయమై, ఇన్సిపెక్టర్ కి బెల్లం వేణుకు మధ్య వాగ్వాదం జరిగింది. ఈ నేపథ్యంలో, కమిటీ నియామక కాలం పూర్తయిందని ఇన్సపెక్టర్ చెప్పడంతో, తమ దృష్టికి నేరుగా తీసుకురాకుండా, నోటీసులు అంటించి చేతులు దులుపుకోవవడాన్ని బెల్లం వేణు తప్పు పట్టడాన్ని ఇన్సిపెక్టర్ జీర్ణించుకోలేక పోయింది. తాను బెల్లం వేణు కింద జవానుని కాదు అని, ఒక ఆడపిల్లను అని చూడకుండా దుర్భాషలు ఆడారని కన్నీళ్ల పర్యంతం అయ్యింది. మొత్తం 30 టాబ్లెట్స్ మింగినట్టు ఏడ్చుకుంటు తెలిపింది. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం..
