Monday, August 17, 2026
HomeWorldజేఈఈ మెయిన్ అడ్మిట్ కార్డులు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి..?

జేఈఈ మెయిన్ అడ్మిట్ కార్డులు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి..?

📰 Generate e-Paper Clip

జేఈఈ మెయిన్ మొదటి విడత పరీక్షల అడ్మిట్ కార్డులు త్వరలో విడుదల కానున్నాయి. అడ్మిట్ కార్డులను ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

ఆంజనేయులు న్యూస్: దేశంలోని ప్రఖ్యాత విద్యా సంస్థల్లో ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ మెయిన్ 2023 పరీక్షల నిర్వహణకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ఏర్పాట్లు చేస్తోంది. మొదటి విడత పరీక్షల అడ్మిట్ కార్డులు త్వరలో విడుదల కానున్నాయి. జనవరి 24 నుంచి 31 తేదీ వరకు మొదటి విడత పరీక్షలు జరగనున్నాయి. అడ్మిట్ కార్డుపై సెంటర్, తేదీ, షిఫ్ట్ వంటి వివరాలు ఉంటాయి. కాబట్టి అడ్మిట్ కార్డులను ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం..

అడ్మిట్ కార్డు డౌన్ లోడ్ ఇలా.

jeemain. nta. nic. in వెబ్సైట్ కు వెళ్లాలి.

హోంపేజీలో జేఈఈ మెయిన్ అడ్మిట్ కార్డు 2023 సెషన్-1కు సంబంధించి లింక్ పై క్లిక్ చేయాలి.

మీ అప్లికేషన్ నంబర్, పుట్టిన తేదీ వివరాలతో లాగిన్ అవ్వాలి.

జేఈఈ మెయిన్ అడ్మిట్ కార్డు స్క్రీన్ పై కనబడుతుంది.

ఆ తర్వాత దాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓ కాపీని ప్రింటవుట్ తీసుకుని పెట్టుకోవాలి.

కార్డుపై మీరు పరీక్ష రాసే నగరం, ఇతర వివరాలన్నీ ఉన్నాయో లేదో సరిచూసుకోండి.

ఏదైనా సమస్య ఉంటే jeemain@nta.ac. in. ద్వారా ఎన్టీఏకి ఇ-మెయిల్ చేయొచ్చు.

జేఈఈ తేదీలివే..

దేశంలోని ట్రిపుల్ ఐటీలు, ఎన్ఐటీ, ఇతర విద్యా సంస్థల్లో ఇంజినీరింగ్ కోర్సుల్లో (BE/Btech/ BArch,etc) ప్రవేశాల కోసం ఏటా నిర్వహిస్తున్న జేఈఈ మెయిన్ పరీక్షలను దాదాపు 10 లక్షల మంది విద్యార్థులు రాస్తుంటారు. మెయిన్ లో అర్హత సాధించిన వారికి అడ్వాన్స్ నిర్వహిస్తారు. అందులో వచ్చే ర్యాంక్ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. ఈ ఏడాది జేఈఈ మెయిన్ పరీక్షలను రెండు విడతల్లో నిర్వహిస్తున్న ఎన్టీఏ.. జనవరిలో తొలి విడత, ఏప్రిల్ లో రెండో విడత పరీక్షలు నిర్వహిస్తున్నట్టు ప్రకటించింది. తొలి సెషన్ ను జనవరి 24, 25, 27, 28, 29, 30, 31 తేదీల్లో నిర్వహించనుండగా.. రెండో సెషన్ ఏప్రిల్ 6 నుంచి 12 వరకు జరుగుతుందని ఎన్డీఏ తెలిపింది.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.