Tuesday, August 18, 2026
HomeTelanganaసుప్రీంలో తెలంగాణ ప్రభుత్వానికి ఊరట

సుప్రీంలో తెలంగాణ ప్రభుత్వానికి ఊరట

📰 Generate e-Paper Clip

కాళేశ్వరం మూడో టీఎంసీ భూ సేకరణ కేసులో గతంలో ఇచ్చిన స్టేటస్ కో ఉత్తర్వులను సుప్రీం కోర్టు సవరించింది.

ఆంజనేయులు న్యూస్, దిల్లీ: కాళేశ్వరం ప్రాజెక్టు పై సుప్రీం కోర్టు లో తెలంగాణ ప్రభుత్వానికి ఊరట లభించింది. కాళేశ్వరం మూడో టీఎంసీ భూసేకరణ కేసులో గతంలో ఇచ్చిన స్టేటస్ కో ఉత్తర్వులను సర్వోన్నత న్యాయస్థానం సవరించింది. తుది తీర్పు వచ్చేలోపు అనుమతులపై నిర్ణయం తీసుకునేలా ఉత్తర్వుల్లో సవరణ చేసింది. అనుమతి విజ్ఞప్తుల పరిశీలనకు గోదావరి బోర్డు, సీడబ్ల్యూసీకి తుది తీర్పు వచ్చేలోపు అనుమతులపై నిర్ణయం తీసుకునేలా ఉత్తర్వుల్లో సవరణ చేసింది. అనుమతి విజ్ఞప్తుల పరిశీలనకు గోదావరి బోర్డు, సీడబ్ల్యూసీకి అనుమతి ఇచ్చింది. మూడో టీఎంసీ భూసేకరణను వ్యతిరేకిస్తూ గతంలో చెరుకు శ్రీనివాసరెడ్డి, రైతులు దాఖలు చేసిన పిటిషన్ పై జస్టిస్ కేఎం జోసెఫ్, జస్టిస్ బి. వి. నాగరత్న ధర్మాసనం ఇవాళ విచారణ చేపట్టింది. రాజకీయ కారణాలతోనే కాళేశ్వరానికి అడ్డుపడుతున్నారని రాష్ట్ర ప్రభుత్వం తమ వాదనలు వినిపించింది. వాదనలు విన్న ధర్మాసనం.. గతంలో ఇచ్చిన ఉత్తర్వుల్లో సవరణలు చేస్తూ.. తుది ఉత్తర్వులకు లోబడే ఉంటాయని తెలిపింది. నష్ట పరిహారం తీసుకొని భూములు ఇవ్వదలచుకున్న రైతులకు కూడా అనుమతి ఇచ్చింది. సుప్రీం తుది తీర్పునకు కట్టుబడి ఉంటామని రాష్ట్ర ప్రభుత్వం తరపు న్యాయవాది వైద్యనాదన్ కోర్టుకు తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.