Monday, August 17, 2026
HomeTelanganaమందుబాబులకు గుడ్ న్యూస్!

మందుబాబులకు గుడ్ న్యూస్!

📰 Generate e-Paper Clip

డిసెంబరు 31న అర్ధరాత్రి వరకు మద్యం విక్రయించేందుకు తెలంగాణ ఎక్సైజ్ శాఖ అనుమతిచ్చింది.

ఆంజనేయులు న్యూస్, హైదరాబాద్: మందు బాబులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో మద్యం విక్రయ సమయాన్ని పొడిగించింది. డిసెంబరు 31న అర్ధరాత్రి వరకు మద్యం అమ్మకాలకు ఎక్సైజ్ శాఖ అనుమతి ఇచ్చింది. బార్ అండ్ రెస్టారెంట్లలో రాత్రి ఒంటి గంట వరకు మద్యం విక్రయించేందుకు వీలు కల్పించారు.

మరోవైపు న్యూ ఇయర్ సందర్భంగా పోలీసులు పలు నిబంధనలు విధించారు. త్రీ స్టార్, ఆపై హోటళ్లు, పబ్బులు, క్లబ్బుల ఎంట్రీ, ఎగ్జిట్ ద్వారాల వద్ద సీసీ కెమెరాలను తప్పనిసరిగా అమర్చాలని నిర్వాహకులను ఆదేశించారు. పార్కింగ్ ప్రదేశాల్లోనూ కెమెరాలు తప్పనిసరి చేశారు. అసభ్యకర నృత్యాలు లేకుండా చూడాలని కోరారు. వేడుకల్లో శబ్ద తీవ్రత 45 డెసిబెల్స్ కు మించకూడదని షరతు విధించారు. పరిమితికి మించి టికెట్లు, పాసులు జారీ చేయవద్దని స్పష్టం చేశారు. పబ్బులు, బార్లలో మైనర్లను అనుమతించకూడదని పోలీసులు సూచించారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.