భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టనున్న ప్రజా సంగ్రామ యాత్రపై నెలకొన్న ఉత్కంఠ కొనసాగుతోంది.
ఆంజనేయులు న్యూస్, కరీంనగర్ జిల్లా: భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టనున్న ప్రజా సంగ్రామ యాత్రపై నెలకొన్న ఉత్కంఠ కొనసాగుతోంది. నిర్మల్ జిల్లా భైంసా నుంచి పాదయాత్ర ప్రారంభోత్సవ సభకు పోలీసులు అనుమతి నిరాకరించిన విషయం తెలిసిందే. యాత్ర కోసం ఆదివారం రాత్రి భైంసా వెళ్తున్న బండి సంజయ్ ను జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం వెంకటాపూర్ శివారులో పోలీసులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో పాదయాత్ర అనుమతి కోసం భాజపా నేతలు హైకోర్టును ఆశ్రయించారు. ఉన్నత న్యాయస్థానం నుంచి వస్తేనే ప్రజాసంగ్రామ యాత్ర కొనసాగనుంది. మరోవైపు బండి సంజయ్ ను పోలీసులు గృహనిర్బంధంలో ఉంచారు. ఇంటి నుంచి బయటకు వెళ్లేందుకు యత్నిస్తే అరెస్ట్ చేస్తామని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో భాజపాకు చెందిన న్యాయనిపుణులతో ఆయన చర్చించి ఎలా ముందుకెళ్లాలనేదానిపై నిర్ణయం తీసుకోనున్నారు.
