Monday, August 17, 2026
HomeTelanganaప్రపంచంలోనే అత్యున్నత రాజ్యాంగం మనది

ప్రపంచంలోనే అత్యున్నత రాజ్యాంగం మనది

📰 Generate e-Paper Clip

సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య భావనలో పౌరులందరికీ స్వేచ్ఛా, స్వాతంత్ర్యాలను అందించిన ప్రపంచంలోనే అత్యున్నత రాజ్యాంగం మనది.

మంచిర్యాల కలెక్టర్ భారతి హోళ్ళికేరి

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య భావనలో పౌరులందరికీ స్వేచ్ఛా, స్వాతంత్ర్యాలను అందించిన ప్రపంచంలోనే అత్యున్నత రాజ్యాంగం మనది అని జిల్లా కలెక్టర్ భారతి హోళికేరి అన్నారు. 73వ రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో డి.సి.పి. అఖిల్ మహాజన్ తో కలిసి డా॥ బాబా సాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నవంబర్ 26, 1949న భారత రాజ్యాంగాన్ని ఆమోదించడం జరిగిందని, ప్రతి సంవత్సరం ఈ రోజును రాజ్యాంగ దినోత్సవంగా పాటిస్తున్నామని తెలిపారు. మనం అనుసరిస్తున్న ఏ చట్టమైనా రాజ్యాంగంకు లోబడి ఉంటుందని తెలిపారు. కుల, మత, వర్ణ, వర్గ, ప్రాంత విబేధాలు లేకుండా సమానంగా అందరం భారతీయులమే అని గుర్తు పెట్టుకోవాలని, 6 సభ్యులతో కూడిన బృందం డా॥ అంబేద్కర్ నేతృత్వంలో 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల పాటు శ్రమించి ప్రతి పౌరుడికి సర్వ హక్కులు, విధులు, బాధ్యతలు కల్పించడం జరిగిందని తెలిపారు. సమాజంలో మంచి పౌరులుగా నిలిచి భావితరాలకు స్ఫూర్తినందించాలని అన్నారు. అనంతరం అందరితో భారత సంవిధానము ప్రతిజ్ఞ చేయించారు.
భారతదేశ ప్రజలమగు మేము, భారతదేశమును సార్వభౌమ్య సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యముగా నెలకొల్పుటకు, అందలి పౌరులెల్లరకు సామాజిక, ఆర్థిక, రాజకీయ, న్యాయమును, భావము, భావప్రకటన, విశ్వము, ధర్మము, ఆరాధన – వీటి స్వాతంత్య్రమును, అంతస్తులోను, అవకాశంలోను సమానత్వమును చేకూర్చుటకు, వారందరిలో వ్యక్తి గౌరవమును, జాతి ఐక్యతను, అఖంతను తప్పక ఒనగూర్చు సౌభ్రాతృత్వమును పెంపొందించుటకు, సత్యనిష్టాపూర్వకముగ తీర్మానించుకొని ఈ సంవిధానమును ఇచ్చుకున్నవారిమైతిమి.  కార్యక్రమంలో జిల్లా అధికారులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.