Monday, August 17, 2026
HomeTelanganaపలు పాఠశాలలను తనిఖీ చేసిన అదనపు కలెక్టర్

పలు పాఠశాలలను తనిఖీ చేసిన అదనపు కలెక్టర్

📰 Generate e-Paper Clip

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: తాండూరు మండలంలోని ఎంపీపీఎస్ గోపాల్ నగర్, ఎంపీపీఎస్ రేచిని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎంపీపీఎస్. గోపాల్ నగర్ పాఠశాలలో మన ఊరు – మన బడి ద్వారా చేపట్టిన పనులను పూర్తి చేసినందుకు పాఠశాల ప్రధానోపాధ్యాయాలు సుధాకర్ మరియు కాంట్రాక్టర్ నారాయణను అభినందించారు. అదే విధంగా తాలిమెట్టు కార్యక్రమంలో భాగంగా విద్యార్థుల కనీస అభ్యసన సామర్ధ్యాలతో పాటు తరగతికి చెందిన అభ్యసన సామార్థ్యాలను పరిశీలించి, సంతృప్తి వ్యక్తం చేసారు. ఎంపిపిఎస్ రెచిని పాఠశాలలో టాంజరిన్ ఆప్ ద్వారా 4వ తరగతి విద్యార్థులను పరిశీలించి ఆప్ నందు అభ్యసన సామర్థాలను నమోదు చేశారు. మన ఊరు- మన బడి పనులను 10 రోజులగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్ కొమురయ్యను ఆదేశించారు. జెడ్పిఎస్ఎస్ రేచిని పాఠశాలను సందర్శించి 10వ తరగతి విద్యార్థులకు రాజ్యాంగ పీఠిక పై పూర్తి స్థాయి అవగాహన కల్పించారు. విద్యార్థులకు ఉదయం, సాయంత్రం నిర్వహించే ప్రత్యేక తరగతుల గురించి అడిగి తెలుసుకొని సంతృప్తి వ్యక్తం చేసారు, అనంతరం విద్యార్థులతో కలిసి మధ్యాహ్న – భోజనం చేసారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ ప్రవీణ్ కుమార్, ఎంఈఓ వాసాల ప్రభాకల్, ఎమ్.పీఓ నంద కుమార్, సర్పంచ్ దుర్గుబాయి, ఎమ్ఎన్ఒ. సత్యనారాయణ ప్రధానోపాధ్యాయులు మల్లేషం, సుధాకర్, ఎంవిఎన్  కుమార్ మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.