Monday, August 17, 2026
HomeTelanganaజిల్లా కూచిపూడి కళాకారుల ప్రతిభ

జిల్లా కూచిపూడి కళాకారుల ప్రతిభ

📰 Generate e-Paper Clip

భారతీయ శాస్త్రీయ సంప్రదాయ నృత్యాలన్నీ దేవుళ్లను ఆరాధిస్తూ కొనసాగుతాయి.

తెలుగువారి గొప్ప నృత్య సంపద కూచిపూడి

“నాట్య కీర్తి” అవార్డుతో గురువు అన్నం కల్పన కు ఘనసన్మానం

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: భారతీయ శాస్త్రీయ సంప్రదాయ నృత్యాలన్నీ దేవుళ్లను ఆరాధిస్తూ కొనసాగుతాయి. అందుకే ఆయా అంశాలకు కళాకారులు పలికించే భావాల్లో ఆ భగవంతున్ని సాక్షాత్కరిస్తాడని వక్తలన్నారు. విజయమాధవి సేవా సంస్కృతిక అకాడమీ ఆధ్వర్యంలో హైదరాబాద్ లో శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో ఆదివారం కార్తీక మాస నృత్య మహోత్సవం కార్యక్రమం ఎన్టీఆర్ కళామందిరంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ రాష్ట్రాలకు చెందిన కళాకారులు చక్కటి అంశాలను ప్రదర్శించి ప్రేక్షకులను మెప్పించారు. భారతీయ సాంస్కృతిక వైభవాన్ని చాటిచెప్పారు. ఈ నాట్యోత్సవంలో మంచిర్యాల జిల్లా నుండి శ్రీ నందిని నృత్యాలయం ఫౌండర్, గురువు, నాట్య విభూషణి శ్రీ అన్నం కల్పన గారి శిష్య బృందం నికిత భవాని, శ్రీజ, నక్షత్ర, సాయి హాసిని, యోగిత, అమర్త్య, ప్రతీక, సాధిక, శ్రీ సాన్వి, శ్రీవళ్ళీ, అక్షయ, కూచిపూడి నాట్య ప్రదర్శనలు చెశారు. వారి ప్రతిభను గుర్తించి. “నాట్య కీర్తి” అవార్డును ప్రధానం చెశారు. అనంతరం గరువు అన్నం కల్పన ను “నాట్యకీర్తి” అవార్డ్ తో ఘనంగా సన్మానించారు..

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.