Tuesday, August 18, 2026
HomeWorldకార్గిల్ సైనికులతో మోదీ దీపావళి వేడుకలు

కార్గిల్ సైనికులతో మోదీ దీపావళి వేడుకలు

📰 Generate e-Paper Clip

సంప్రదాయాన్ని కొనసాగిస్తూ ప్రధాని మోదీ ఈ ఏడాది కూడా దేశ రక్షణ కోసం విధులు నిర్వహిస్తోన్న జవాన్లతో కలిసి దీపావళి సంబరాలు చేసుకుంటున్నారు.

ఆంజనేయులు న్యూస్, కార్గిల్: ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ప్రధానమంత్రి నరేంద్రమోదీ సైనికులతో దీపావళి వేడుకలు చేసుకుంటున్నారు. ఇందుకోసం ప్రధాని సోమవారం కార్గిల్ చేరుకున్నారు. కార్గిల్ సైనికులతో కలిసి మోదీ పండగ సంబరాల్లో పాల్గొంటారని ప్రధానమంత్రి కార్యాలయం వెల్లడించింది. కార్గిల్ చేరుకున్న ప్రధాని ఫొటోలను షేర్ చేసింది.
2014లో మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి దీపావళి వేడుకలను సైనికులతో కలిసి చేసుకున్నారు. అప్పటి నుంచి ఏటా అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ దేశ సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తున్న జవాన్లతో కలిసి పండగ సంబరాల్లో పాల్గొంటున్నారు. గతేడాది జమ్మూకశ్మీర్ లోని రాజౌరీ జిల్లా నౌషేరా సెక్టార్లో సైనికులతో కలిసి మోదీ దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సారి కార్గిల్లో ఈ వేడుకలను నిర్వహిస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.