పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా బెల్లంపల్లి సబ్ డివిజన్ పోలీస్ ఆధ్వర్యంలో 2500 మంది తో “మెగా రక్త దాన శిబిరం నిర్వహించారు.
అమరుల త్యాగాలు మరువలేనివి
రక్తదానం మహాదనం, రక్తదానంపై అపోహలు వద్దు
రామగుండం సీపీ ఎస్. చంద్రశేఖర్ రెడ్డి
మొత్తం 2360 యూనిట్ల రక్త సేకరణ
ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా : పోలీస్ అమరవీరుల వారోత్సవాలు సందర్భంగా మంగళవారం బెల్లంపల్లి పట్టణంలోని నెంబర్ 2 ఏఎంసి గ్రౌండ్ లో బెల్లంపల్లి ఏసీపీ ఎడ్ల మహేష్, సబ్ డివిజన్ పోలీసుల ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. రామగుండం సీపీ ఎస్. చంద్రశేఖర్ రెడ్డి ఈ సందర్భంగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా బెల్లంపల్లిలో 2,500 మంది ఒకే రోజు రక్తదానం చేయడం గొప్ప విషయం అన్నారు. పోలీస్ అమరవీరులకు ఆయన నివాళులర్పించారు. ఈ రక్తదాన శిబిరంలో 2360 యూనిట్ల రక్తం సేకరణ జరిగింది. కార్యక్రమంలో ఏసీపీ ఎడ్ల మహేష్, సీఐలు రాజు, బాబురావు, జగదీష్ , ప్రమోద్ రావు, రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్ భాస్కర్ రెడ్డి, వైస్ చైర్మన్ మహేందర్, జిల్లా కోశాధికారి శ్రీనివాస్, మధుసూదన్ రెడ్డి, సత్యపాల్ రెడ్డి, వివిధ స్వచ్ఛంద సేవ సంస్థల ప్రతినిధులు, పెద్ద సంఖ్యలో యువతీ యువకులు, విద్యార్థులు, అధికారులు పాల్గొన్నారు.



