
ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: ఈ నెల 14 నుండి 18 వరకు జరగనున్న సిపిఐ జాతీయ మహాసభలను విజయవంతం చేయాలని కోరుతూ సోమవారం మంచిర్యాల పట్టణంలో మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. సిపిఐ జాతీయ సమితి సభ్యులు కలవేన శంకర్ ప్రారంభించిన ఈ ర్యాలీ అన్ని ముఖ్య కూడళ్ల మీదుగా సాగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. దేశంలో మతోన్మాద రాజకీయాలకు చరమగీతం పాడేందుకు ఈ మహాసభలు తోడ్పడాలని ఆకాంక్షించారు. ఈ మహాసభలు మతోన్మాదానికి వ్యతిరేకంగా బిజెపిని గద్దె దించడం కోసం, మతోన్మాదనికి వ్యతిరేకంగా సెక్యులర్ పార్టీల ముఖ్యమంత్రుల సదస్సుకు వేదిక కానున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్, పట్టణ కార్యదర్శి ఖలిందర్ అలీ ఖాన్, ఎఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల దాసు, నాయకులు రేగుంట చెంద్రశేఖర్, జోగుల మల్లయ్య, వీరభద్రయ్య, కారుకురి నగేష్, లింగం రవి, మిట్టపల్లి శ్రీనివాస్, పౌల్, మిర్యాల రాజేశ్వర్ రావు, దేవి పోచన్న, దొడ్డిపట్ల రవీందర్, తదితరులు పాల్గోన్నారు.
