Monday, August 17, 2026
HomeCrimeఆదిలాబాద్ జిల్లాలో దారుణం....వివాహితపై గ్యాంగ్ రేప్

ఆదిలాబాద్ జిల్లాలో దారుణం….వివాహితపై గ్యాంగ్ రేప్

📰 Generate e-Paper Clip

ఆంజనేయులు న్యూస్, ఆదిలాబాద్ జిల్లా: లో దారుణం జరిగింది. ఓ వివాహితపై నలుగురు సామూహిక లైంగిక దాడి చేసిన ఘటన తలమడుగు మండలంలోని డోర్లి గ్రామంలో చోటుచేసుకుంది. పదిరోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆంజనేయులు న్యూస్ వెబ్ సైట్ కథనం ప్రకారం. గ్రామానికి చెందిన గిరిజన మహిళ (30)కు భర్త, పిల్లలు ఉన్నారు. పది రోజుల క్రితం కుటుంబ సభ్యులు పనులకు వెళ్లగా, మహిళ ఇంట్లో ఒంటరిగా ఉంది. ఇదే గ్రామానికి చెందిన నలుగురు వ్యక్తులు మహిళ ఇంటికి వచ్చారు. ఒంటరిగా ఉండటం గమనించి ఆమెపై సామూహిక లైంగికదాడి చేశారు. అనంతరం ఎవరికైనా చెబితే చంపుతామని బెదిరించి వెళ్లిపోయారు.

పది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న బాధితురాలిని కుటుంబ సభ్యులు నిలదీశారు, ఆదివారం ఆమె అసలు విషయం చెప్పింది. దీంతో కుటుంబ సభ్యులు సహకారంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.. ఈ మేరకు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ప్రవళిక తెలిపారు, బాధితురాలు పేర్కొన్న నలుగురిలో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. మరో ఇద్దరి కోసం గాలిస్తున్నట్లు చెప్పారు, గ్యాంగ్ రేప్ సమాచారం అందుకున్న ఆదిలాబాద్ రూరల్ సీఐ రఘుపతి గ్రామానికి చేరుకొని విచారణ చేపట్టారు. త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తానని తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.