Tuesday, August 18, 2026
HomeCrimeపోలీసు అధికారులకు నగదు పురస్కారాలు

పోలీసు అధికారులకు నగదు పురస్కారాలు

📰 Generate e-Paper Clip

ఆంజనేయులు న్యూస్, ఆదిలాబాద్ జిల్లా: రాష్ట్ర పోలీసు రిక్రూట్మెంట్ మరియు జేఎన్టీయూ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎస్సై, కానిస్టేబుల్ ప్రిలిమినరీ రాత పరీక్ష ను బయోమెట్రిక్ విధానంలో విజయవంతంగా పూర్తి కావడానికి కృషి చేసిన పోలీసు అధికారులకు సిబ్బందికి రాష్ట్ర పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు నగదు పురస్కారాలను మంగళవారం స్థానిక పోలీసు ముఖ్య కార్యాలయంలో ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి అందజేశారు. సి సమయ్ జాన్ రావు – అడిషనల్ ఎస్పీ డిటిసి, కె ఉమామహేశ్వరరావు – డిటిసి డిఎస్పీ, ఎస్ గణేష్ – కమ్యూనికేషన్ ఎస్ఐ, జె సంజీవ్ కుమార్ – సైబర్ క్రైమ్ ఐటీ కోర్ ఇన్చార్జ్, డి. సునీల్ – ఎస్సై ఇంద్రవెల్లి, భరత్ సుమన్, – ఎస్సై ఉట్నూర్, పి శ్రీనివాస్ – ఫింగర్ ప్రింట్ ఏఎస్ఐ, ఎండి ఇష్టముద్దీన్ – కానిస్టేబుల్, ఆర్ అవినాష్ – కానిస్టేబుల్ లకు అందజేశారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ. ప్రతిభ కనబరిచిన ప్రతి అధికారికి ప్రశంస తప్పకుండా లభిస్తుందని, జిల్లాలోని ప్రతి ఒక్క పోలీసు సిబ్బంది నిశ్చయంతో సమయపాలన పాటిస్తూ విధులను సక్రమంగా నిర్వర్తించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అవార్డు గ్రహీతలతో పాటు డిసిఆర్బి ఇన్స్పెక్టర్ జె గుణవంతురావ్, సీసీ దుర్గం శ్రీనివాస్, పోలీసు అసోసియేషన్ అధ్యక్షుడు పెంచాల వెంకటేశ్వర్లు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.