Monday, August 17, 2026
HomePoliticalభాజపా మూర్ఖత్వం చూస్తుంటే విచిత్రంగా ఉంది: కేటీఆర్

భాజపా మూర్ఖత్వం చూస్తుంటే విచిత్రంగా ఉంది: కేటీఆర్

📰 Generate e-Paper Clip

ఆంజనేయులు న్యూస్, హైదరాబాద్: భాజపా మూర్ఖత్వం చూస్తుంటే విచిత్రంగా ఉందని మంత్రి కేటీఆర్ విమర్శించారు. అధికారంలోకి రాగానే అర్హులందరికీ ఉచిత విద్యుత్, పక్కా ఇళ్లు ఇస్తామని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై ట్విటర్ వేదికగా కేటీఆర్ ఘాటుగా స్పందించారు. “ఉచితాలు వద్దని ఓ పక్క విశ్వగురు చెబుతారు. మరోపక్క ఉచిత విద్య, వైద్యం, ఆరోగ్యం, ఇళ్లు ఇస్తామని బండి సంజయ్ హామీ ఇస్తారు. కేంద్రంలో ఉంది భాజపా సర్కారే కదా? మరి ఉచిత విద్య, వైద్యం, ఇళ్లు ఇచ్చేందుకు పార్లమెంటులో బిల్లు పెట్టేందుకు మిమ్మల్ని ఎవరు ఆపుతున్నారు? ” అని కేటీఆర్ ప్రశ్నించారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.