Monday, August 17, 2026
HomeTelanganaఅందరికీ కనిపించేలా గన్!

అందరికీ కనిపించేలా గన్!

📰 Generate e-Paper Clip

తెరాస నాయకుడి ఫొటో వైరల్

పలువురికి గన్ లైసెన్సులు ఇస్తున్నారు: ఈటల

ఆ ఆరోపణల్లో నిజం లేదు: సిపి సత్యనారాయణ

ఆంజనేయులు న్యూస్, కరీంనగర్: కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గానికి చెందిన ఒక తెరాస నాయకుడు (ఎంపీపీ భర్త) టీ షర్టు వెనకాల గన్ కనిపించేలా పెట్టుకున్న ఫొటో బుధవారం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టింది. ఇటీవల ఓ కార్యక్రమంలో అందరికీ కనిపించేలా ఆయన వద్ద గన్ ఉన్న తీరు చర్చనీయాంశమైంది. తన నియోజకవర్గంలో పలువురికి గన్ లైసెన్స్ ను ఇస్తున్నారని భాజపా నాయకుడు, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ బుధవారం విలేకరుల సమావేశంలో ఆరోపించిన నేపథ్యంలో ఈ ఫొటో వెలుగు చూడటం ప్రాధాన్యం సంతరించుకుంది.

ఇది సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడం, ఎమ్మెల్యే మాట్లాడటంతో కరీంనగర్ పోలీసు కమిషనర్ సత్యనారాయణ హుజూరాబాద్ లో బుధవారం సాయంత్రం విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో తాము విచ్చలవిడిగా గన్ లైసెన్స్ లు ఇస్తున్నామనేది అవాస్తవమని చెప్పారు. గత రెండేళ్లలో నియోజకవర్గంలో ఇద్దరికి మాత్రమే గన్లై సెన్సులు జారీ చేశామని తెలిపారు. అందరికీ కనిపించేలా గన్ పెట్టుకున్న నాయకుడిని హెచ్చరించామని చెప్పారు. మరోసారి ఇలా వ్యవహరిస్తే లైసెన్స్ రద్దు చేస్తామని సీపీ స్పష్టం చేశారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.