Monday, August 17, 2026
HomeWorldసీబీఐపై కేసీఆర్ కీలక వ్యాఖ్యలు..

సీబీఐపై కేసీఆర్ కీలక వ్యాఖ్యలు..

📰 Generate e-Paper Clip

ఆంజనేయులు న్యూస్, పట్నా: సీబీఐ, ఈడీ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థల అధికారాలను కేంద్రం దుర్వినియోగం చేస్తోందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. రాజకీయంగా కక్ష సాధింపుల కోసం కేంద్రంలోని భాజపా సర్కారు వీటిని ఉపయోగిస్తోందని దుయ్యబట్టారు. ఈ తరహా దాడులు ఆగాలంటే సీబీఐకిచ్చిన సమ్మతిని అన్ని రాష్ట్రాలూ ఉపసంహరించుకోవాలన్నారు. బిహార్ పర్యటనలో భాగంగా బిహార్ సీఎం నీతీశ్ కుమార్ తో కలిసి బుధవారం విలేకరులతో మాట్లాడిన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు.. పోలీసింగ్ అంశం రాష్ట్రాల పరిధిలోనిదని పేర్కొన్నారు. బిహార్ లో అధికారంలో ఉన్న మహా కూటమి నేతలు సైతం ఇదే తరహా డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో కేసీఆర్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

దిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్ మెంట్ యాక్ట్, 1946 సెక్షన్ ప్రకారం.. ఏదైనా రాష్ట్రంలో దర్యాప్తు నిర్వహించాలంటే సీబీఐ ఆ రాష్ట్ర ప్రభుత్వ అనుమతి తీసుకోవాలి. ఒకవేళ రాష్ట్రాలు తమ సాధారణ సమ్మతిని ఉపసంహరించుకుంటే ఆ రాష్ట్ర పరిధిలో ఏదైనా కేసు నమోదు చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వం అనుమతి తప్పనిసరి. ఇప్పటికే పశ్చిమ బెంగాల్, ఛత్తీస్గాడ్  రాజస్థాన్, పంజాబ్, మేఘాలయ సహా 9 రాష్ట్రాలు ఈ తరహా సమ్మతిని ఉపసంహరించుకున్నాయి. గతంలో ఏపీ ప్రభుత్వం సైతం సమ్మతిని ఉపసంహరించుకుంది. తాజాగా సీఎం కేసీఆర్ సైతం ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.