Tuesday, August 18, 2026
HomeWorldడ్రైవరు, కండక్టర్ సస్పెన్షన్..!!

డ్రైవరు, కండక్టర్ సస్పెన్షన్..!!

📰 Generate e-Paper Clip

స్టాపునకు దూరంగా ఆగిన ప్రభుత్వ బస్సు

దివ్యాంగ కుమారుడిని మోసుకుని కి.మీ నడిచిన తండ్రి

ఆంజనేయులు న్యూస్, ప్యారిస్: కలెక్టరు కార్యాలయానికి మానసిక దివ్యాంగ కుమారుడితోపాటు ప్రభుత్వ బస్సులో వెళ్తున్న ఓ వ్యక్తిని స్టాపు నుంచి దూరంగా దించేశారు. ఈ విషయంలో డ్రైవరు, కండక్టరు సస్పెండయ్యారు. కృష్ణగిరి జిల్లా హోసూర్ సమీప బేగేపల్లికి చెందిన గోపాలకృష్ణన్ ఆటో డ్రైవరు. ఇతను సోమవారం జిల్లా కలెక్టరు కార్యాలయంలో జరిగిన గ్రీవెన్స్ లో వినతిపత్రం ఇవ్వడానికి హోసూర్ నుంచి భార్య, తన మానసిక దివ్యాంగ కుమారుడు హరిప్రసాద్ (16)తో ప్రభుత్వ బస్సులో బయల్దేరాడు. కలెక్టరు కార్యాలయం సమీపిస్తుండగా బస్సుని ఆపమని అడిగాడు. అందుకు కండక్టర్.. బస్సు వంతెనపై వెళ్తుండడంతో ఆపడం కుదరదని చెప్పి అక్కడ నుంచి ఒకటిన్నర కి. మీ దూరంలో వారిని దింపారు.

దీంతో గోపాలకృష్ణన్ తన కుమారుడిని మోసుకొని నడుచుకుంటూ కలెక్టరేటికి వచ్చి పిటిషన్ ఇచ్చారు. ఈ ఘటన సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో బాధ్యులైన బస్సు డ్రైవరు, కండక్టర్ పై చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేశారు. విచారించిన అధికారులు డ్రైవరు మాదేష్, కండక్టర్ శక్తివేల్ ను తాత్కాలికంగా సస్పెండు చేస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.