Tuesday, August 18, 2026
HomeWorldక్షణం ఆలస్యమైనా పాము కాటేసేదే..! అంతలో ఏం జరిగిందంటే

క్షణం ఆలస్యమైనా పాము కాటేసేదే..! అంతలో ఏం జరిగిందంటే

📰 Generate e-Paper Clip

ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది

ఆంజనేయులు న్యూస్: ఓ ఇంటి బయటి చివరి మెట్టు కింది అంచున నాగుపాము నెమ్మదిగా పాకుతోంది. అప్పుడే తల్లితో కలిసి ఇంటి నుంచి బయటకు వస్తున్న ఆ బాలుడికి ఈ విషయం తెలియదు. దీంతో ఎప్పటిలాగే కింద అడుగేశాడో లేదో.. చప్పున వెనక్కు మళ్లిందా సర్పం. అంతలోనే బాలుడు తిరిగి వెనక్కి రావడంతో.. ఒక్కసారిగా పడగ విప్పిన సర్పం బుసలు కొడుతూ అతని వైపు వచ్చింది. ఇది గమనించిన బాలుడి తల్లి వెంటనే అప్రమత్తమై అతన్ని వెనక్కి లాగడం.. అంతా క్షణాల్లో జరిగిపోయింది. ఒళ్లు గగుర్పొడిచేలా ఉన్న ఈ ఘటన కర్ణాటకలోని మాండ్య జిల్లాలో చోటుచేసుకుంది.

ఈ ఘటనకు సంబంధించిన సీసీకెమెరా ఫుటేజీ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. బాలుడి తల్లి సమయస్ఫూర్తిని, ఆమె ధైర్యసాహసాలను నెటిజన్లు కొనియాడుతున్నారు. ‘ఒక్క సెకను ఆలస్యమైనా పాము అతన్ని కాటేసేదే! తల్లి ప్రేమకు సెల్యూట్ అంటూ ఓ నెటిజన్ కామెంట్ పెట్టారు. ప్రమాదం నుంచి అద్భుతంగా కాపాడారంటూ మరొకరు స్పందించారు. ‘వర్షాకాలంలో బొరియలు నీటితో నిండిపోవడంతో పాములు సురక్షిత ఆవాసం కోసం బయటకు వస్తాయి. కాబట్టి.. ఈ సమయంలో అందరూ జాగ్రత్తగా ఉండాలి’ అని ఓ ఐఎఫ్ఎస్ అధికారి ట్విటర్ వేదికగా తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.