Monday, August 17, 2026
HomeWorldఈ రోడ్డు మా బాబుది..

ఈ రోడ్డు మా బాబుది..

📰 Generate e-Paper Clip

రహదారిపై కుర్చీ వేసుకుని మద్యం సేవించిన బాబీ కటారియా

కేసు నమోదు

దేహ్రాదూన్: బాడీ బిల్డర్, ఇన్స్టా గ్రామ్ ఇన్ప్లూయెన్సర్ బాబీ కటారియా మరో వివాదంలో చిక్కుకున్నారు. విమానం సీట్లో పడుకొని సిగరెట్ కాల్చిన ఘటనకు సంబంధించి అతడిపై ఇటీవలే కేసు నమోదైన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు నడి రోడ్లో కూర్చొని మద్యం సేవించినందుకు అతడిపై మరో కేసు నమోదైంది. ఉత్తరాఖండ్ లోని దేహ్రాదూన్-ముస్సోరీ రహదారిపై కుర్చీలో కూర్చొని మద్యం తాగుతున్న వీడియోను కటారియా తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశాడు. ఆ వీడియో నేపథ్యంలో ‘రోడ్స్ అప్నే బాప్ కీ.. (ఈ రోడ్లు మా నాన్నవి..)’ అనే పాట వినిపిస్తోంది. ఈ వీడియో వైరల్ గా మారడంతో పోలీసులు కటారియాపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

ఈ విషయాన్ని ఉత్తరాఖండ్ డీజీపీ శుక్రవారం వెల్లడించారు. దేవభూమిగా పిలిచే ఉత్తరాఖండ్ సంస్కృతిని కటారియా నాశనం చేస్తున్నాడని స్థానికులు మండిపడుతున్నారు. అతడి ఇన్స్టాగ్రామ్ ఖాతాకు 6.3లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు..

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.