Monday, August 17, 2026
HomeCrimeఎదురుకాల్పులు.. ముగ్గురు మావోయిస్టుల హతం

ఎదురుకాల్పులు.. ముగ్గురు మావోయిస్టుల హతం

📰 Generate e-Paper Clip

భోపాల్: మధ్యప్రదేశ్ లో మావోయిస్టులు- భద్రతా దళాలకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో ముగ్గురు మావోయిస్టులు హతమయ్యారు. లో అటవీ ప్రాంతంలో సోమవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. మృతి చెందిన మావోయిస్టుల్లో ఒక మహిళ ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. అయితే, ఈ ముగ్గురి మావోలపై మొత్తంగా రూ.30లక్షల రివార్డు ఉన్నట్లు తెలిపారు. ‘మధ్యప్రదేశ్ బాలాఘాట్ జిల్లా బహేలా పోలీస్ స్టేషన్ ప్రాంతంలో భద్రతా దళాలకు మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్ కౌంటర్లో ముగ్గురు మావోలు ప్రాణాలు కోల్పోయారు. వారి ముగ్గురి పైనా రివార్డ్ ఉంది. మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో ఈ ఎన్ కౌంటర్ చోటుచేసుకుంది’ అని మధ్యప్రదేశ్ హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా పేర్కొన్నారు.

చనిపోయిన వారిలో డివిజినల్ కమిటీ సభ్యుడు నగేష్పైన రూ.15 లక్షల రివార్డు ఉండగా.. ఏరియా కమాండర్ మనోజ్తోపాటు రమే అనే మహిళపై చెరో ఎనిమిది లక్షల క్యాష్ రివార్డు ఉన్నట్లు వివరించారు. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో కూంబింగ్ నిర్వహిస్తోన్న ప్రత్యేక దళాలు ఇందులో పాల్గొన్నట్లు హోంమంత్రి వెల్లడించారు..

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.