Wednesday, August 19, 2026
HomeAndhraతిరుమల శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ మంత్రి హరీశ్ రావు

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ మంత్రి హరీశ్ రావు

📰 Generate e-Paper Clip

తిరుమల: తిరుమల శ్రీవారిని తెలంగాణ మంత్రి హరీశ్ రావు దర్శించుకున్నారు. తన పుట్టిన రోజు సందర్భంగా స్వామివారి దర్శనం చేసుకున్నారు. గురువారం రాత్రి అలిపిరి నుంచి కాలినడక తిరుమల చేరుకున్న ఆయన.. ఈ ఉదయం తలనీలాలు సమర్పించుకుని శ్రీవారి అభిషేక సేవలో పాల్గొన్నారు. తన పుట్టినరోజు సందర్భగా అభిమానులు, మిత్రులెవరూ హైదరాబాద్, సిద్దిపేట రావొద్దని ఇప్పటికే హరీశ్ రావు ట్విటర్ ద్వారా కోరిన విషయం తెలిసిందే. తనపై ఉన్న ప్రేమాభిమానాలను సేవా కార్యక్రమాల ద్వారా చాటాలన్నారు. తనకు సందేశం పంపిస్తున్న వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.