Wednesday, August 19, 2026
HomeCrimeకామాంధుడి అరెస్ట్..!

కామాంధుడి అరెస్ట్..!

📰 Generate e-Paper Clip

మీడియా సమావేశంలో మాట్లాడుతున్న పెద్దపల్లి ఏసిపి సారంగపాణి

6 గంటల లోపే అదుపులోకి నిందితుడు..?

పెద్దపల్లి జిల్లా: 9 ఏళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడిన కామాంధుడిని అదుపులోకి తీసుకున్నట్లు పెద్దపల్లి ఏసిపి సారంగపాణి పేర్కొన్నారు. శుక్రవారం ఏసిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఓదెల మండలం లోని ఓ గ్రామంలో  గురువారం జమ్మికుంట మండలానికి చెందిన 9 ఏళ్ల మైనర్ బాలికపై షిలారపు రమేష్ అత్యాచారం చేశాడన్నారు. బాలిక బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని, సుల్తానాబాద్ సిఐ ఇంద్రసేనారెడ్డి, పొత్కపెళ్లి ఎస్సై లక్ష్మణ్ ఆధ్వర్యంలో నాలుగు బృందాలుగా విడిపోయి సాంకేతికత ఆధారంగా సంఘటన జరిగిన 6 గంటలలోపే నిందితుడిని అదుపులోకి తీసుకున్నామన్నారు. చట్టపరంగా నిందితుడికి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు..

సబ్ డివిజన్ పరిధిలో మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన, మైనర్ బాలికల జోలికి వెళ్లిన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మహిళల రక్షణ కోసం షీ టీమ్ లు పనిచేస్తున్నాయని, ఎవరైనా అసభ్యకరంగా ప్రవర్తించినా పోలీసులకు సమాచారం అందించాలన్నారు. ఈ మీడియా సమావేశంలో సుల్తానాబాద్ ఇంద్రసేనారెడ్డి, ఎస్ఐ లక్ష్మణ్ లతో పాటు పలువురు పాల్గొన్నారు..

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.