Thursday, August 20, 2026
HomeTelangana2 లక్షలు దాటిన గ్రూప్-1 దరఖాస్తులు

2 లక్షలు దాటిన గ్రూప్-1 దరఖాస్తులు

📰 Generate e-Paper Clip

హైదరాబాద్: రాష్ట్రంలో గ్రూప్-1 దరఖాస్తులు 2 లక్షలు దాటాయి. ఈ నెల 2న దరఖాస్తుల ప్రక్రియ  ప్రారంభమవగా మంగళవారం రాత్రి 2,00,428 దాటినట్లు కమిషన్ ఒక ప్రకటనలో తెలిపింది. దరఖాస్తుల సమర్పణకు గడువు ఈ నెల 31తో ముగియనుంది. ఇటీవల ప్రభుత్వం గ్రూప్-1లో యూనిఫాం పోస్టులైన డీఎస్పీ, డీఎస్, ఏఈఎస్ పోస్టులకు గరిష్ఠ వయోపరిమితి 31 ఏళ్ల నుంచి 33 ఏళ్లకు పెంచింది. డీఎస్పీ, ఏఈఎస్ పోస్టులకు పోటీపడే పురుష, మహిళా అభ్యర్థులకు ఎత్తును తగ్గించింది. అర్హులైన అభ్యర్థులు చివరిరోజు వరకు వేచి చూడకుండా వెంటనే దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.

పదోతరగతి ద్వితీయ భాష పరీక్షకు 4,890 మంది గైర్హాజరు

పదోతరగతి పరీక్షల్లో మంగళవారం జరిగిన ద్వితీయ భాష పరీక్షకు 4,890 మంది గైర్హాజరయ్యారు. 5,08,143 మందికి గాను 5,03,253 మంది (99.04%) పరీక్ష రాశారు. మాల్రాక్టీస్ కు పాల్పడుతూ నల్గొండ జిల్లాలో నలుగురు విద్యార్థులు పట్టుబడ్డారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.