2 లక్షలు దాటిన గ్రూప్-1 దరఖాస్తులు

హైదరాబాద్: రాష్ట్రంలో గ్రూప్-1 దరఖాస్తులు 2 లక్షలు దాటాయి. ఈ నెల 2న దరఖాస్తుల ప్రక్రియ  ప్రారంభమవగా మంగళవారం రాత్రి 2,00,428 దాటినట్లు కమిషన్ ఒక ప్రకటనలో తెలిపింది. దరఖాస్తుల సమర్పణకు గడువు ఈ నెల 31తో ముగియనుంది. ఇటీవల ప్రభుత్వం గ్రూప్-1లో యూనిఫాం పోస్టులైన డీఎస్పీ, డీఎస్, ఏఈఎస్ పోస్టులకు గరిష్ఠ వయోపరిమితి 31 ఏళ్ల నుంచి 33 ఏళ్లకు పెంచింది. డీఎస్పీ, ఏఈఎస్ పోస్టులకు పోటీపడే పురుష, మహిళా అభ్యర్థులకు ఎత్తును తగ్గించింది. అర్హులైన అభ్యర్థులు చివరిరోజు వరకు వేచి చూడకుండా...