Wednesday, August 19, 2026
HomeCrimeఆన్ లైన్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి..!

ఆన్ లైన్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి..!

📰 Generate e-Paper Clip

రామగుండం సిపి ఎస్. చంద్రశేఖర్ రెడ్డి

రామగుండం పోలీస్ కమిషనరేట్: ఆన్ లైన్ మోసాలు పెరుగుతున్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రామగుండం పోలీస్ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. అపరిచిత వ్యక్తుల ఫోన్ల నుంచి వచ్చే మెసేజ్ లింకులను ఎట్టి పరిస్థితులలో క్లిక్ చేయవద్దని సూచించారు. Any desk, Team Viewer వంటి అప్లికేషన్ల గురించి అవగాహన లేకుండా డౌన్లోడ్ చేసుకోవద్దన్నారు. లాటరీ, గిఫ్ట్ కార్డ్స్ వచ్చాయని, క్రెడిట్ కార్డులు, రివార్డ్ పాయింట్స్ జమయ్యాయని ఎవరైన కాల్ చేస్తే నమ్మవద్దని తెలిపారు. ఇలాంటి మోసాల బారిన పడిన వారు వెంటనే అధికారిక పోర్టల్ (https: //cybercrime. gov. in/)లో ఫిర్యాదు చేయాలని, లేదా ట్రోల్ ఫ్రీ నెంబర్ 1930, డయల్ 100 నంబర్ కు కాల్ చేసి పూర్తి సమాచారం ఇస్తే, అకౌంట్ ఫ్రీజ్ చేసి అమౌంట్ వెనక్కి తెచ్చుకోవచ్చని సిపి తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.