Tuesday, August 18, 2026
HomeTelanganaపోటీతత్వంతో కష్టపడి ఉద్యోగం సాధించాలి.!

పోటీతత్వంతో కష్టపడి ఉద్యోగం సాధించాలి.!

📰 Generate e-Paper Clip

మంచిర్యాల జిల్లా: ప్రభుత్వ ఉద్యోగాల పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న నిరుద్యోగ యువతకు గుడిపేటలోని 13వ బెటాలియన్ లో నిర్వహిస్తున్న ఉచిత శిక్షణ తరగతులను గురువారం కలెక్టర్ భారతీ హోలికెరీ, మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీల భర్తీ చేపట్టనున్న నేపథ్యంలో వివిధ ఉద్యోగాలకు సిద్దమవుతున్న నిరుద్యోగ యువతకు ప్రభుత్వమే ఉచిత శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతి అభ్యర్థి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పోటీతత్వంతో కష్టపడి ఉద్యోగం సాధించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో అదనపు కమాండెంట్ నురేష్, సహాయ కమాండెంట్ రఘునాథ్ చౌహాన్, తదితరులు పాల్గొన్నారు..

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.