Tuesday, August 18, 2026
HomeCrimeఅటవీ శాఖ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం..!

అటవీ శాఖ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం..!

📰 Generate e-Paper Clip

ఆదిలాబాద్ జిల్లా: బోథ్, ఇచ్చోడ మండల కేంద్రంలోని కవ్వాల్ టైగర్ జోన్ అటవీ శాఖ కార్యాలయంలో శుక్రవారం మధ్యాహ్నం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో భారీ అగ్నిప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఒక్కసారిగా ఉవ్వెత్తున మంటలు ఎగిసిపడడంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. చుట్టుపక్కల కాలనీ వాసులు రోడ్డుపై వెళ్లే ప్రజలు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన అటవీశాఖ అధికారులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు..

అక్కడికి చేరుకున్న అగ్నిమాపక శకటం మంటలను ఆర్పి వేశారు. అయితే ఈ ప్రమాదంలో కొన్ని వాహనాలు పాక్షికంగా దగ్ధమైనట్లు తెలుస్తోంది. ఇంకా పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.