Tuesday, August 18, 2026
HomeWorldవేసవిలో ఆహార పదార్థాలను తాజాగా ఉంచుకోండిలా.!

వేసవిలో ఆహార పదార్థాలను తాజాగా ఉంచుకోండిలా.!

📰 Generate e-Paper Clip

వేసవిలో ఆహార పదార్థాలు త్వరగా పాడవుతాయి. పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు వడలిపోతాయి.

అయితే కొన్ని చిట్కాలు పాటిస్తే వేసవిలో ఆహార పదార్థాలను తాజాగా ఉంచవచ్చు.

అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..?

ఫ్రిజ్ ఉష్ణోగ్రతను తగ్గించి 5 డిగ్రీల కంటే తక్కువ ఉండేలా చూసుకోవాలి. తాజా గుడ్లు, మాంసాన్ని తప్పకుండా ఫ్రిజ్లోనే పెట్టాలి. బ్యాక్టీరియా చేరకుండా ఉండాలంటే వండిన పదార్థాలను, పచ్చి కూరగాయలను వేరువేరు అరల్లో సర్దుకోవాలి.

దూరప్రయాణాలకు వెళ్తుంటే ఆహారాన్ని గది ఉష్ణోగ్రత వద్ద చల్లారిన తర్వాతే బాక్సుల్లో సర్దాలి. వీలైతే కూల్ కంటైనర్ లో పెట్టడం మంచిది.

పాలు, పులుసులు, కూరలు వంటి వాటిని కొద్ది గంటల వ్యవధితో తరచుగా వేడి చేస్తూ ఉండాలి. మరుగు వచ్చేంతవరకు స్టవ్ మీద ఉంచాలి.

పెరుగు పులిసిపోకుండా ఉండాలంటే ఫ్రిజ్ లోనే నిలువ చేయాలి. ఫ్రిజ్ లో ఇరుకిరుకుగా పెట్టకూడదు. గాలి ఆడేందుకు ఖాళీ ఉంచాలి. అప్పుడే అందులోని పదార్థాలు పాడవకుండా ఉంటాయి.

ఫ్రిజ్ లోంచి తీసిన పదార్థాలను వెంటనే వండొద్దు. కాసేపటి తర్వాత వండుకోవాలి.

వీలైనంత వరకు పండ్లు, కూరగాయలు, ఆకుకూరలను తరిగాక, గాలి చొరబడని డబ్బాల్లో నిలువ చేయడం ఉత్తమం..

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.