Tuesday, August 18, 2026
HomeTelanganaనేటి నుంచే గ్రూప్-1, పోలీస్ పోస్టులకు దరఖాస్తులు

నేటి నుంచే గ్రూప్-1, పోలీస్ పోస్టులకు దరఖాస్తులు

📰 Generate e-Paper Clip

తెలంగాణ: తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-1, పోలీసు, ఇతర విభాగాల యూనిఫాం పోస్టులకు నేటి నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. 503 గ్రూప్-1 పోస్టుల కోసం ఈనెలాఖరు వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. టీఎస్ పీఎస్సీ వెబ్ సైట్ లో లింక్ అందుబాటులో ఉంటుంది. గ్రూప్-1 కు అప్లై చేసే అభ్యర్థులు ముందుగా ఓటీఆర్ ఎడిట్ చేసుకోవాలి. టీఎస్పీఎస్సీ వెబ్సైటు వెళ్లి ఓటీఆర్ ఐడీ, పుట్టిన తేదీ నమోదు చేస్తే మొబైల్ కు ఓటీపీ వస్తుంది. ఓటీపీ నమోదు చేస్తే దరఖాస్తు చేసేందుకు అవకాశం వస్తుంది. ఓటీఆర్ డేటా బేస్ ప్రకారం పేరు, పుట్టిన తేదీ, విద్యార్హతలు, కమ్యునిటీ తదితర వివరాలన్నీ కనిపిస్తాయి. ఈ వివరాలు సరైనవని నిర్దారిస్తే కన్ఫామ్ పై క్లిక్ చేయాలి. ఏమైనా పొరపాట్లు ఉంటే నో ఆప్షన్ పై క్లిక్ చేయాలి. వివరాలు సరి చేసుకున్న తర్వాత ఫీజు చెల్లించాలి. అభ్యర్ధులందరూ తప్పనిసరిగా దరఖాస్తు ప్రాసెస్ ఫీజు రూ.200, పరీక్ష ఫీజు రూ.120 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, దివ్యాంగులు, మాజీ సైనిక ఉద్యోగులకు ఫీజు మినహాయింపు ఉంటుంది.

ఇతర రాష్ట్రాల అభ్యర్థులకు పరీక్ష ఫీజు నుంచి ఎటువంటి మినహాయింపు లేదు. ఫీజు చెల్లించిన అనంతరం దరఖాస్తు పీడీఎఫ్ కాపీని భద్రపరుచుకోవాలి. ప్రిలిమినరీ పరీక్షకు ప్రతి అభ్యర్ధి 12 జిల్లా పరీక్ష కేంద్రాలను ప్రాధాన్యక్రమంలో ఎంపిక చేసుకోవాలి. జిల్లా కేంద్రాల్లో గ్రూప్-1 పరీక్ష నిర్వహించనున్నారు. పోలీసు, ఇతర విభాగాల యూనిఫాం పోస్టులకు కూడా ఇవాల్టి నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఈనెల 20 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంది. www.TSLPRB.in వైబ్సైట్లో లింకును అందుబాటులో ఉంటుంది. పోలీసు శాఖలో 541 ఎస్ఐ, 14 వేల 881 కానిస్టేబుళ్ల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చారు. స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్లో 12 ఎస్ఐ, 390 కానిస్టేబుళ్లు పోస్టులను భర్తీ చేయనున్నారు. అగ్నిమాపకశాఖలో 26 స్టేషన్ ఫైర్ ఆఫీసర్లు, 610 ఫైర్ మెన్ పోస్టులకు నేటి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు. జైళ్ల శాఖ 5 8 డిప్యూటీ జైలర్లు, 146 వార్డర్లు, రవాణ శాఖ 63 ట్రాన్స్పోర్ట్ కానిస్టేబుళ్లు, ఎక్సైజ్ శాఖలో 614 ప్రొహిబిషన్ ఎక్సైజ్ కానిస్టేబుళ్ల పోస్టులు కూడా భర్తీ చేయనున్నారు. సోమవారం ఉదయం 8 గంటల నుంచి ఈనెల 20వ తేదీ రాత్రి 10 గంటల వరకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు..

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.