Thursday, August 20, 2026
HomeCrimeకేటీఆర్ అమెరికా పర్యటన.. దిగ్గజ సంస్థల ప్రతినిధులతో భేటీ

కేటీఆర్ అమెరికా పర్యటన.. దిగ్గజ సంస్థల ప్రతినిధులతో భేటీ

📰 Generate e-Paper Clip

న్యూయార్క్: రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా (యూఎస్ఏ)లో పర్యటిస్తోన్న రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, ఆయన బృందానికి వివిధ సంస్థల నుంచి అద్భుత స్పందన వస్తోంది. ఇవాళ వరల్డ్ టాప్ ఫార్మా కంపెనీలతో కేటీఆర్ బృందం సమావేశమైంది. తెలంగాణలో ఫార్మా, లైఫ్ సైన్సెస్ సెక్టారు మరింత బలోపేతం చేసేలా ఫైజర్, జె అండ్ జె, జీఎఎస్కే వంటి దిగ్గజ కంపెనీలతో సమావేశమయ్యారు. సంస్థలు ఫార్చ్యూన్ 500 కంపెనీల్లో భాగం కాగా.. వీటి వార్షిక ఆదాయం 170 బిలియన్ డాలర్లుగా ఉంది. ఈ మూడు <span;>ఆదాయం 170 బిలియన్ డాలర్లుగా ఉంది. ఈ మూడు కంపెనీల్లో 3 లక్షలకు పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు. అటువంటి దిగ్గజ కంపెనీలతో మంత్రి కేటీఆర్ సమావేశమై.. హైదరాబాద్ ఫార్మా గ్రోత్ స్టోరీలో భాగం కావాలని కోరారు. ఈ సందర్భంగా కేటీఆర్ ఇచ్చిన ప్రెజెంటేషన్ ను కంపెనీల ప్రతినిధులు అభినందించారు. తెలంగాణలో ఫార్మా, లైఫ్ సైన్సెస్ వృద్ధికి తెలంగాణ ప్రభుత్వం పాటుపడుతున్న తీరును స్వాగతించారు. హైదరాబాద్ లైఫ్ సైన్సెస్ను మరింత ముందుకు తీసుకెళ్లేలా భాగం కావాలని కేటీఆర్ ఇచ్చిన పిలుపునకు సానుకూలంగా స్పందించారు. 2023లో జరిగే బయో ఆసియా సదస్సులో పాల్గొనాలని కంపెనీల ప్రతినిధులను కేటీఆర్ ఆహ్వానించారు..

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.