Friday, August 21, 2026
HomeTelanganaఉక్రెయిన్ లో చదువుతున్న తెలంగాణ విద్యార్థులకు కేసీఆర్ గుడ్ న్యూస్..?

ఉక్రెయిన్ లో చదువుతున్న తెలంగాణ విద్యార్థులకు కేసీఆర్ గుడ్ న్యూస్..?

📰 Generate e-Paper Clip

హైదరాబాద్: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా అక్కడి విశ్వవిద్యాలయాల్లో మెడిసిన్ చదువుతున్న భారతీయ విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. భవిష్యత్తులో అక్కడి పరిస్థితులు ఎలా ఉంటాయో.. భారతీయ విద్యార్థులు ఇకపై అక్కడ వైద్య విద్యను కొనసాగించవచ్చా.. లేదా.. అనే విషయంలో విద్యార్థుల్లో అనేక సందేహాలు మెదులుతున్నాయి. తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో చివరి రోజు సీఎం కేసీఆర్ సభలో ద్రవ్య వినిమయ బిల్లు ప్రవేశపెట్టారు. అనంతరం బిల్లుపై చర్చ జరిగింది. చర్చలో భాగంగా ఉక్రెయిన్ లో వైద్యవిద్యను అభ్యసిస్తున్న తెలంగాణ విద్యార్థుల భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకొని సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. వారందరి చదువుకు కావాల్సిన ఖర్చును భరించి విద్యార్థులందరూ ఇక్కడే మెడిసిన్ చదివే విధంగా చర్యలు తీసుకోన్నట్లు ప్రకటించారు..

సీఎం మాట్లాడుతూ.. “దాదాపు 20వేలకు పైగా భారతీయ విద్యార్థులు ఉక్రెయిన్ లో చిక్కుకుపోయారు. ఇవాళ కళ్ల ముందు కనిపిస్తోన్న నిజం ఇది. ఇప్పటివరకు 740కి పైగా తెలంగాణ బిడ్డలను స్వరాష్ట్రానికి తీసుకొచ్చాం. వీరందరూ ఉక్రెయిన్ మెడిసిన్ చదివేందుకే వెళ్లారని తెలిసింది. అక్కడ రూ. 25 లక్షల్లో మెడిసిన్ పూర్తి అవుతుంది.. ఇక్కడ రూ.కోటి అడుగుతున్నారు.. అని అంటున్నారు. ఇంత పెద్ద మొత్తంలో వెచ్చించలేని వారు అక్కడైనా చదువుకుందామని ఉక్రెయిన్ కు వెళ్లారు. ఇక్కడ సరైన అవకాశాల్లెక అక్కడికి వెళ్తున్నారని తెలిసింది. ప్రస్తుతం రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతోంది. అక్కడి పరిస్థితులు ఎప్పటికి కుదుటపడుతాయో తెలియని పరిస్థితి. విద్యార్థుల భవిష్యత్ పై ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. తిరిగి ఉక్రెయిన్ వెళ్లిపోయే పరిస్థితులు ప్రస్తుతం కనిపించడం లేదు. ఈ విషయమై భారత ప్రభుత్వానికి లేఖ రాస్తాం. అన్ని ఖర్చులు భరిస్తూ 740కిపైగా తెలంగాణ బిడ్డలు ఇక్కడే మెడిసిన్ చదివేలా ఏర్పాటు చేస్తాం. వారి భవిష్యత్తు దెబ్బతినకుండా, చదువును మధ్యలో ఆపకుండా అన్ని చర్యలు తీసుకుంటాం” అని సీఎం కేసీఆర్ సభలో ప్రకటించారు. సాధ్యమైనంత త్వరగా ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ను సీఎం ఆదేశించారు..

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.