ఉక్రెయిన్ లో చదువుతున్న తెలంగాణ విద్యార్థులకు కేసీఆర్ గుడ్ న్యూస్..?
హైదరాబాద్: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా అక్కడి విశ్వవిద్యాలయాల్లో మెడిసిన్ చదువుతున్న భారతీయ విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. భవిష్యత్తులో అక్కడి పరిస్థితులు ఎలా ఉంటాయో.. భారతీయ విద్యార్థులు ఇకపై అక్కడ వైద్య విద్యను కొనసాగించవచ్చా.. లేదా.. అనే విషయంలో విద్యార్థుల్లో అనేక సందేహాలు మెదులుతున్నాయి. తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో చివరి రోజు సీఎం కేసీఆర్ సభలో ద్రవ్య వినిమయ బిల్లు ప్రవేశపెట్టారు. అనంతరం బిల్లుపై చర్చ జరిగింది. చర్చలో భాగంగా ఉక్రెయిన్ లో వైద్యవిద్యను అభ్యసిస్తున్న తెలంగాణ విద్యార్థుల భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకొని...