
డిసిపి సుధీర్ రాంనాథ్ కేకన్.. పట్టణ సిఐ ముస్కె రాజు
ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: జిల్లా కేంద్రంలోని పదవ తరగతి పరీక్షా కేంద్రాలను శనివారం డిసిపి సుధీర్ రాంనాథ్ కేకన్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పరీక్ష కేంద్రాల్లోని గదులు, పరిసరాల్లో ఏర్పాట్లను పరిశీలించారు. పరీక్షలు సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఈ తనిఖీల్లో డిసిపీతో పాటు పట్టణ సిఐ ముస్కె రాజు పాల్గొన్నారు.


